News November 19, 2025
రాబోయే రోజుల్లో HYD పరిస్థితి ఏంటి?

HYD మరో ఢిల్లీ కానుందా? ఈ పరిస్థితి అవుననేలా చేస్తోంది. నగరంలో దీపావళి నాడు ఏకంగా AQI 410కిపైగా నమోదైంది. దీంతో ప్రమాదపు డేంజర్ బెల్ రెడ్ సిగ్నల్ మోగించింది. దీనిని అంచనా వేసిన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు రాబోయే రోజుల్లో మహానగర పొల్యూషన్ పెనుముప్పుగా మారే అవకాశం ఉన్నట్లు అంచనా వేశారు. కానీ.. గ్రౌండ్ లెవెల్లో పీసీబీ చర్యలు అంతంత మాత్రంగానే ఉన్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు.
Similar News
News January 19, 2026
రెవెన్యూ లోటుతో ఉక్కిరిబిక్కిరి

మూడేళ్లుగా APని రెవెన్యూ లోటు ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. కమిటెడ్ వ్యయం పెరగడం, పన్నేతర ఆదాయం తగ్గడం దీనికి కారణమని కాగ్ నివేదిక పేర్కొంటోంది. FY25-26 NOV నాటికి ₹54355 CR రెవెన్యూ లోటు ఉంది. ఈ లోటు 2024లో ₹56805 CR, 2023లో ₹47063 CRగా ఉంది. దీని భర్తీకి అప్పులు చేయక తప్పడం లేదు. రుణాల్లో 80% శాలరీ, పెన్షన్లు వంటి రెవెన్యూ ఖర్చుకే సరిపోతుండగా క్యాపిటల్ వ్యయం అంతంతే.
News January 19, 2026
JGTL: ‘ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందుల కొరతకు చెక్’

ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఔషధాల కొరతకు చెక్ పెట్టే దిశగా JGTLలో రూ.3 కోట్లతో సెంట్రల్ మెడిసిన్ స్టోర్‌ను రేపు ప్రారంభించనున్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అన్ని ప్రభుత్వ ఆసుపత్రులకు అవసరమైన మందులు ఒకే కేంద్రం నుంచి సరఫరా చేసే విధానం అమల్లోకి రానుందన్నారు. పేద రోగులకు ఉచితంగా నాణ్యమైన ఔషధాలు సమయానికి అందించడమే లక్ష్యమన్నారు. ఔషధాల నిల్వ, పంపిణీలో పారదర్శకత వైద్య సేవలు మరింత బలోపేతం అవుతాయన్నారు.
News January 19, 2026
రాజకీయ వేధింపులే కాంగ్రెస్ అజెండా: KTR

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీశ్ రావుకు <<18900983>>నోటీసులు<<>> జారీ చేయడంపై KTR తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ రాజకీయ వేధింపులకు పాల్పడుతోందని ‘X’ వేదికగా మండిపడ్డారు. ఇందులో పస లేదని సుప్రీంకోర్టే కేసును కొట్టివేసిందని గుర్తు చేశారు. అయినా నోటీసులు ఇవ్వడం ప్రభుత్వ దిగజారుడుకు నిదర్శనమన్నారు. రేవంత్ బావమరిది సుజన్ రెడ్డి బొగ్గు గనుల కుంభకోణాన్ని బయటపెట్టినందుకే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని అన్నారు.


