News November 7, 2025
రామగుండం కమిషనరేట్‌లో వందేమాతరం గీతాలాపన

రామగుండం కమిషనరేట్‌లో వందేమాతరం గీతాలాపన కార్యక్రమాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. బంకించంద్ర చటర్జీ రచించిన వందేమాతర గీతం 150 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. రామగుండం సీపీ అంబర్ కిషోర్ హాజరై అధికారులు, సిబ్బందితో కలిసి గీతాలాపన చేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ శ్రీనివాస్, ఏసీపీ ప్రతాప్‌తోపాటు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Similar News
News January 15, 2026
మెగా సిటీలుగా తిరుపతి, విశాఖ, అమరావతి: CM CBN

AP: తిరుపతి చెరువులకు, విజయవాడ కెనాల్స్, విశాఖకు బీచ్‌కు ప్రసిద్ధి అని CM చంద్రబాబు అన్నారు. ఈ మూడింటినీ మెగా సిటీలుగా తీర్చిదిద్దుతామని తెలిపారు. రాబోయే రోజుల్లో తిరుపతి వెడ్డింగ్ డెస్టినేషన్ హబ్‌గా మారుతుందని నారావారిపల్లెలో మీడియాతో పేర్కొన్నారు. 2027 నాటికి రెవెన్యూ సమస్యలన్నీ పరిష్కరిస్తామని, ప్రతి నెలా 9న పట్టాదారు పుస్తకాలు అందిస్తామని చెప్పారు.
News January 15, 2026
బాపట్ల: త్రిపురనేని రామస్వామికి చౌదరికి నివాళి

నేటి సమాజంలో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించుకోవడానికి, సమానత్వం వైపు అడుగులు వేయడానికి త్రిపురనేని రామస్వామి చౌదరి జీవితం స్ఫూర్తి అని ఎస్పీ బి.ఉమామహేశ్వర్ అన్నారు. గురువారం జిల్లా ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో త్రిపురనేని రామస్వామి చౌదరి జయంతిని పోలీసు అధికారుల ఆధ్వర్యంలో జరిగింది. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘననివాళులర్పించారు.
News January 15, 2026
BREAKING: టెర్రస్ వార్.. HYDలో చిందిన రక్తం

అత్తాపూర్ PS పరిధిలోని పాండురంగనగర్‌బస్తీలో పతంగులు ఎగరేస్తున్న సమయంలో రెండు అపార్ట్‌మెంట్‌ల వాసుల మధ్య ఘర్షణ జరిగింది. మద్యం మత్తులో ఉన్న కొందరు యువకులు ఖాళీ సీసాలను పక్క బిల్డింగ్‌పైకి విసిరారు. కొందరు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయగా గొడవ జరిగింది. కొందరు యువకులు కర్రలతో దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో ఇరు వర్గాలకు గాయాలు అయ్యాయి. ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసుకున్నారు.


