News March 13, 2025

రామగుండం: కమిషనరేట్ పరిధిలోని SIలతో CPసమావేశం

image

రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి- మంచిర్యాల జిల్లాల పరిధిలో పనిచేస్తున్న ఎస్‌ఐలతో పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా కమిషనరేట్‌లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా CPమాట్లాడుతూ.. ఏదైనా ఘటన జరిగినప్పుడు తక్షణమే స్పందించాలని, తద్వారా విలువైన సమాచారం లభిస్తుందని అన్నారు. ఫిర్యాదుదారులకు సరైన న్యాయం చేసేందుకు కృషి చేయాలన్నారు. పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలన్నారు.

Similar News

News February 11, 2026

సూర్యాపేట: క్యూ లైన్‌లో నిలబడి ఓటేసిన కలెక్టర్

image

మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా పట్టణంలోని 14వ నంబర్ పోలింగ్ కేంద్రాన్ని కలెక్టర్ తేజస్ నందలాల్ సందర్శించారు. ఓటింగ్ సరళిని పర్యవేక్షించిన అనంతరం, సామాన్య ఓటరులా క్యూలైన్‌లో నిలబడి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య బలోపేతానికి ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని, ఓటర్ల సౌకర్యార్థం అన్ని కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించామని తెలిపారు.

News February 11, 2026

గుండారం గుట్టల ప్రాంతంలో పెద్దపులి..?

image

కోహెడ మండలం నుంచి మల్లారం హైవే దాటి పెద్దపులి బెజ్జంకి మండలంలోని మల్లోని చెరువు గుండారం గుట్టల ప్రాంతంలోకి ప్రవేశించినట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు. దీంతో రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వచ్చే మూడు రోజుల పాటు పశువులను ఇంటి వద్దే కట్టేసుకోవాలని, చీకటి పడే వరకు పొలాల వద్ద ఉండకూడదని హెచ్చరించారు. బెజ్జంకి పోలీసులు కూడా గ్రామస్థులకు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తూ గస్తీని పెంచారు.

News February 11, 2026

VKB: 4 మున్సిపాలిటీల్లో @9am 11.15% పోలింగ్

image

VKBలోని 4 మున్సిపాలిటీల్లో 9 గంటల వరకు 11.15% పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. వికారాబాద్ మున్సిపల్‌లో 11.56%, తాండూర్‌లో 10.39% పరిగిలో 10.78%, కొడంగల్‌లో 15.21% పోలింగ్ నమోదైనట్లు తెలిపారు. మధ్యాహ్నం తర్వాత భారీగా ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.