News September 11, 2025

రామగుండం: కోర్సులు పూర్తి చేసిన వారికి సర్టిఫికెట్లు అందజేత

image

రామగుండం సింగరేణి సంస్థ RG-1 ఆధ్వర్యంలో గతేడాది వివిధ కోర్సుల్లో ఉచిత శిక్షణ ఇచ్చిన అనంతరం గురువారం స్థానిక RCOA క్లబ్ ఆవరణలో మహిళలకు పరీక్ష నిర్వహించారు. HYD ఖాది గ్రామ ఉద్యోగ మహా విద్యాలయం ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహించి సర్టిఫికెట్లను అందజేశారు. కోర్సులు పూర్తి చేసిన వారు స్వయంగా యూనిట్స్ ఏర్పాటు చేసుకొని ఉపాధి పొందాలని GM లలిత్ కుమార్ అన్నారు. సేవా అధ్యక్షురాలు అనిత, అధికారులు పాల్గొన్నారు.

Similar News

News December 17, 2025

సూర్యాపేటలో తొలి సర్పంచ్ విజయం

image

సూర్యాపేట జిల్లాలో బుధవారం నిర్వహించిన మూడో విడత ఎన్నికల మొదటి ఫలితం విడుదలైంది. ఈ ఎన్నికలో నేరేడుచర్ల మండలం జానలదిన్నె గ్రామ పంచాయతీ సర్పంచిగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి గజ్జి సరిత బీఆర్ఎస్ అభ్యర్థిపై 30 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఈ గెలుపుతో ఆమె హర్షం వ్యక్తం చేశారు. తన ఎన్నికకు సహకరించిన ఓటర్లందరికి కృతజ్ఞతలు తెలిపారు. గ్రామాభివృద్ధికి తన వంతు బాధ్యతగా విధులు నిర్వర్తిస్తానన్నారు.

News December 17, 2025

RRలో బోణీ కొట్టిన BRS.. బేగరికంచ సర్పంచ్‌గా వెంకటేశ్

image

3వ విడత సర్పంచ్ ఎన్నికల ఫలితాల్లో BRS మద్దతుదారు బోణీ కొట్టారు. కందుకూరు మండలం బేగరికంచ సర్పంచ్ స్థానంపై ఉత్కంఠకు తెరపడింది. BRS బలపరిచిన వాడ్యావత్ వెంకటేశ్ నాయక్ సమీప ప్రత్యర్థిపై 118 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. 4 వార్డుల్లో BRS, మిగతా 4 వార్డుల్లో కాంగ్రెస్ వార్డు సభ్యులు విజయం సాధించారు. ఫ్యూచర్ సిటీకి దగ్గరగా ఉండే బేగరికంచలో BRS మద్దతుదారు గెలవడంతో శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.

News December 17, 2025

పరిపాలనలో పవన్, లోకేశ్ భేష్: చంద్రబాబు

image

AP: డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేశ్‌లను సీఎం CBN అభినందించారు. ఉప ముఖ్యమంత్రి వేరే రంగం నుంచి వచ్చినా పరిపాలనలో చక్కటి పనితీరు కనబరుస్తున్నారని ప్రశంసించారు. నిన్న ఓ కానిస్టేబుల్ తన ఊరికి రోడ్డు లేదని డిప్యూటీ సీఎంకు సమాచారం అందిస్తే… అదే వేదిక నుంచి ఆ రోడ్డుకు రూ.3.90 కోట్లు మంజూరు చేయించామని చెప్పారు. మంత్రి లోకేశ్ గూగుల్ డేటా సెంటర్ విశాఖకు తీసుకువచ్చారని కలెక్టర్ల సమావేశంలో అభినందించారు.