News November 6, 2025

రామగుండం: ‘కోల్ ఇండియా స్థాయిలో రాణించాలి’

image

రామగుండం-3, అడ్రియాల ప్రాజెక్ట్ ఏరియాలో రామగిరి మండలంలోని రాణి రుద్రమదేవి క్రీడా ప్రాంగణంలో గురువారం RG-3, ఏపీఏ, భూపాలపల్లి ఏరియాల మధ్య రీజినల్ స్థాయి హాకీ పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమాన్ని ఎస్వోటుజీఎం ఎం.రామ్మోహన్ ప్రారంభించి, సింగరేణి ఉద్యోగులు క్రీడలలో ప్రతిభ కనబరిచి కోల్ ఇండియా స్థాయిలో సంస్థకు గౌరవం తీసుకురావాలని సూచించారు. అధికారులు, సంఘం సభ్యులు, క్రీడాకారులు పాల్గొన్నారు.

Similar News

News January 18, 2026

రాజకీయం ఇప్పుడే మొదలైంది: శివసేన(UBT)

image

ముంబై మున్సిపల్ ఎన్నికల ఫలితాల తర్వాత ‘రిసార్ట్ రాజకీయం’ మొదలైన తరుణంలో శివసేన (UBT) కీలక వ్యాఖ్యలు చేసింది. ‘ఎన్నికలు ముగిశాయి. ఫలితాలు వచ్చాయి. అసలైన రాజకీయం ఇప్పుడే మొదలవుతుంది’ అని సామ్నా ఎడిటోరియల్‌లో పేర్కొంది. ముంబైకి ఇప్పటివరకు 23 మంది మరాఠీ మేయర్లను అందించిన సంప్రదాయం కొనసాగుతుందా అని ప్రశ్నించింది. మేయర్ ఎంపిక విషయంలో CM ఫడణవీస్, Dy.CM షిండే మధ్య అంతర్గత పోరు నడుస్తోందని రాసుకొచ్చింది.

News January 18, 2026

హైదరాబాద్‌పై NTR చెరగని ముద్ర

image

HYDపై మాజీ CM దివంగత NTR చెదరని ముద్ర వేశారు. ట్యాంక్‌బండ్‌‌లో మనం చూసే బుద్ధ విగ్రహం ఆయన ఆలోచనలోనుంచే పుట్టింది. ఇందులో 1990 మార్చి 10న ప్రపంచంలోనే ఎత్తైన ఏకశిలా బుద్ధ విగ్రహ తొలి ప్రతిష్ఠ విషాదంగా మారింది. అనంతరం 1992లో విజయవంతంగా ప్రతిష్ఠించగా, నేడు అది HYDకు ప్రతీకగా నిలుస్తోంది. సాగరతీరం సౌందర్యవృద్ధికి 1996లో నెక్లెస్ రోడ్డును రూపుదిద్దారు. నేడు ఆయన వర్ధంతి సందర్భంగా HYD ఆయనను స్మరిస్తోంది.

News January 18, 2026

మన మేడ్చల్ జిల్లాలో మొక్కజొన్న పంట

image

మన మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పరిధిలో ఈ యాసంగి సీజన్‌లో రైతులు మొక్కజొన్న పంటను శాస్త్రీయ వంగడాలతో సాగు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ సీజన్‌లో సుమారు 78 ఎకరాలలో శాస్త్రవేత్తలు సూచించిన నూతన వంగడాల సాగుకు రైతన్నలు సిద్ధమవుతున్నారు. ఆయా ప్రాంతాల్లో అధిక దిగుబడి సాధించినట్లయితే, వివిధ రకాల శాస్త్రీయ వంగడాలను రాష్ట్ర వ్యాప్తంగా విస్తరింపనున్నారు.