News February 16, 2025
రామచంద్రపురంలో చికెన్ ధరలు

రామచంద్రపురం మండలంలో ఆదివారం చికెన్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. లైవ్ కేజీ రూ. 110, బ్రాయిలర్ కేజీ రూ.180, ఫారం కేజీ రూ.160, స్కిన్ లెస్ ( బాయిలర్)కేజీ రూ.200 విక్రయిస్తున్నట్లు చోడవరం బైపాస్ వద్ద చికెన్ దుకాణదారులు పేర్కొన్నారు. అధికారులు సూచన మేరకు పరిశుభ్రమైన వాతావరణంలో చికెన్ అమ్మకాలు జరుపుతున్నట్లు వారు తెలిపారు. మరి మీ ప్రాంతంలో చికెన్ ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.
Similar News
News April 17, 2026
శ్రీకాకుళం: టుడే టాప్ న్యూస్ ఇవే

మెళియాపుట్టి: భార్యను చంపిన కేసులో భర్తకు జీవిత ఖైదు
వ్యవసాయం రైతులకు జీవనాడి: జడ్పీ సీఈఓ
శ్రీకాకుళం: జిల్లా కేంద్రానికి చేరుకున్న నరసన్నపేట పంచాయతీ రగడ
జనగణన ప్రక్రియను ప్రారంభించిన మంత్రి అచ్చెన్న
పాలీసెట్ ఏర్పాట్లు పూర్తి చేయాలి: కలెక్టర్
పాడి పరిశ్రమ అభివృద్ధికి కృషి చేయండి: ఎమ్మెల్యే బగ్గు
News April 17, 2026
నాణ్యమైన ఉత్పత్తులనే అందించాలి: ఐటీడీఏ పీవో

భద్రగిరి మార్ట్‌లో నాణ్యత ధ్రువీకరించిన వ్యవసాయ, నిత్యావసర సరుకులనే విక్రయించాలని ఐటీడీఏ పీవో రాహుల్ అధికారులను ఆదేశించారు. గురువారం నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. ఆర్గానిక్ ఉత్పత్తులను గ్రేడింగ్ చేశాకే సేకరించాలని, ప్యాకెట్లపై తయారీ, గడువు తేదీలు ఉండాలని స్పష్టం చేశారు. ఎస్‌హెచ్‌జీ మహిళల సరుకుల తయారీని అధికారులు నెలకు ఒకసారి క్షేత్రస్థాయిలో పరిశీలించి నాణ్యతను నిర్ధారించాలని సూచించారు.
News April 17, 2026
VKB: వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు వహించండి: కలెక్టర్

ఎండలు తీవ్రమవుతున్న నేపథ్యంలో ప్రజలు వడదెబ్బ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ దీపక్ తివారి సూచించారు. కలెక్టరేట్‌లో అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకు ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దన్నారు. భూగర్భ జలాలు తగ్గుతున్నందున నీటిని పొదుపుగా వాడటంపై ప్రజల్లో అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఎండల దృష్ట్యా అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలన్నారు.


