News September 1, 2024
రామపురంలో సాగర్ ఎడమ కాలువకు గండి
నడిగూడెం మండల పరిధిలోని రామచంద్రాపురం 117 కిలోమీటర్ల వద్ద వరదకి సాగర్ ఎడమ కాలువకు గండిపడింది. పంట పొలాల నుంచి వరద నీరు గ్రామంలోకి చేరుతోంది. గతంలో గండి పడడంతో అధికారులు తాత్కాలికంగా మరమ్మతులు చేశారు. ఎన్ఎస్పి అధికారుల నిర్లక్ష్యమే కారణమని రైతులు ఆరోపిస్తున్నారు.
Similar News
News September 8, 2024
జాతీయ రహదారిపై కారులో మంటలు
చిట్యాల పట్టణ శివారులో గల పెట్రోల్ పంపు సమీపంలో జాతీయ రహదారిపై ప్రమాదవశాత్తు కారులో మంటలు చెలరేగాయి. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారు. మంటలను గుర్తించి వెంటనే కారును పక్కకు ఆపడంతో ఇద్దరికీ ప్రాణాపాయ తప్పింది. ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు.
News September 8, 2024
నాగార్జునసాగర్ ప్రాజెక్టు గేట్లు ఎత్తివేత.. తరలివస్తున్న పర్యాటకులు
నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో సాగర్ గేట్లు ఎత్తడంతో పర్యాటకులు తరలి వస్తున్నారు. ఆదివారం సెలవు కావడంతో సాగర్ గేట్లు, జల విద్యుత్ కేంద్రం, ఎత్తిపోతల జలపాతం, నాగార్జునకొండ తదితర ప్రాంతాలలో పర్యాటకుల సందడి నెలకొంది. ప్రాజెక్టు వద్ద ఎలాంటి ప్రమాద ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు, అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
News September 8, 2024
ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి కోమటిరెడ్డి
నల్గొండ పట్టణంలో పలు వార్డులలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పలు వినాయకుని మండపాల వద్ద ప్రత్యేక పూజలు చేశారు. మంత్రి మాట్లాడుతూ.. దైవచింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుందన్నారు. ప్రతి ఒక్కరు దైవ చింతన అలవర్చుకోవాలని కోరారు. వారి వెంట మున్సిపల్ ఛైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, గుమ్మల మోహన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.