News August 9, 2024

రామభద్రపురంలో విషాదం.. తండ్రీకొడుకు సూసైడ్

image

రామభద్రపురం మండలం ముచ్చర్లవలసలో రోజుల వ్యవధిలో తండ్రీకొడుకు ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటుచేసుకుంది. గత నెల 24న నడగాన సురేశ్ (24) ఉరేసుకుని మృతిచెందాడు. అతని మరణం తట్టుకోలేని తండ్రి రవణ (55) బుధవారం సాయంత్రం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ఐ జ్ఞానప్రసాద్ తెలిపారు. పొలంలో పురుగుమందు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్ళగా.. ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందినట్లు ఎస్ఐ వెల్లడించారు.

Similar News

News December 13, 2025

మానవత్వం చాటుకున్న VZM ఎస్పీ.. రోడ్డు ప్రమాద బాధితురాలికి తక్షణ సాయం

image

ఎస్పీ ఏఆర్.దామోదర్ గరివిడిలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొని తిరిగి వస్తున్నప్పుడు గుర్ల మండలం దుగ్గివలస గ్రామ సమీపంలో బైక్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఒక మహిళను గమనించారు. వెంటనే తన వాహనాన్ని ఆపి, గాయపడిన మహిళకు సపర్యలు చేశారు. అనంతరం ​అటుగా వస్తున్న ఆటోను చికిత్స కోసం నెల్లిమర్ల మిమ్స్ ఆసుపత్రికి తరలించారు.

News December 13, 2025

24న జాతీయ వినియోగదారుల దినోత్సవం: VZM JC

image

జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని ఈనెల 24న నిర్వహించాలని విజయనగరం జేసీ ఎస్.సేథు మాధవన్ సూచించారు. శుక్రవారం తన ఛాంబర్‌లో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈనెల 18వ తేదీ నుంచి వినియోగదారుల వారోత్సవాలు ప్రారంభం కానున్నాయని తెలిపారు. ఈసారి ‘డిజిటల్ న్యాయపాలన, సమర్థ సత్వర పరిష్కారం’ ఇతివృత్తంగా కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. తెలుగు, ఇంగ్లిషులో వ్యాసరచన, వక్తృత్వ పోటీలు ఉంటాయన్నారు.