News November 8, 2025
రామాపురం వద్ద కూలిన చప్టాను రూ.6.5 లక్షలతో మరమ్మతులు

రామాపురం వద్ద కూలిన చప్టాను రూ.6.5 లక్షలతో తాత్కాలికంగా మరమ్మతులు చేయించామని కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితి రాకుండా హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణానికి రూ.రెండు కోట్ల అంచనాలతో తయారుచేసిన ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపుతామన్నారు. కొత్తపేట గ్రామంలో చప్టాను రూ.12 లక్షలతో తాత్కాలికంగా మరమ్మతు చేయవచ్చన్నారు. శాశ్వత పరిష్కారానికి రూ.3.50 కోట్లతో అంచనాలు రూపొందించామన్నారు.
Similar News
News January 23, 2026
నంద్యాలలో ఉత్కంఠ

ఇటీవల జరిగిన పలు ఘటనలతో నంద్యాల విజయ డెయిరీ వార్తల్లో నిలిచింది. ఈనెల 31న ముగ్గురు డైరెక్టర్ల పదవీ కాలం ముగియనుంది. దీంతో ఆ 3 పదవులకు ఇవాళ నామినేషన్లు స్వీకరించనున్నారు. డైరెక్టర్లే ఛైర్మన్‌ను ఎన్నుకోనుండటంతో ఇరు వర్గాల వారు ఈ పదవులు దక్కించుకునేందుకు పావులు కదుపుతున్నారు. ఇటీవల జరిగిన పలువురు డైరెక్టర్ల హౌస్ అరెస్టులు, విమర్శలు, ప్రతి విమర్శలతో ఈ ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి.
News January 23, 2026
శ్రీనిధి రకం కోళ్ల ప్రత్యేకత ఏమిటి?

శ్రీనిధి జాతి కోళ్లు గోధుమ రంగులో ఉంటాయి. నాటుకోడి గుడ్లకు సమానంగా ఈ కోడి గుడ్లు కూడా అధిక పోషకాలను కలిగి ఉంటాయి. ఈ కోళ్లు 5 నెలల వయసు నుంచే గుడ్లను పెట్టడం ప్రారంభిస్తాయి. ఏడాదికి 140 నుంచి 160 గుడ్లను పెడతాయి. అన్ని వాతావరణ పరిస్థితులను, కొన్ని రకాల వ్యాధులను తట్టుకొని జీవిస్తాయి. పొడవైన కాళ్లతో, ఆకర్షణీయంగా ఉంటాయి. పెరటికోళ్లు పెంచాలనుకునేవారికి శ్రీనిధి కోళ్లు కూడా అనుకూలమైనవి.
News January 23, 2026
నేడు వసంత పంచమి.. ఈ పనులు చేయకండి

వసంత పంచమిని జ్ఞానాన్ని వృద్ధి చేసుకునే రోజుగా చెప్తారు. ఇవాళ పొరపాటున కూడా కొన్ని పనులు చేయకూడదని పండితులు చెబుతున్నారు. ‘దీనిని ప్రకృతి పండుగగా భావిస్తారు. నేడు వసంత రుతువు ప్రారంభమవుతుంది. అందుకే చెట్లు, మొక్కలకు హాని చేయకూడదు. నలుపు రంగు దుస్తులు ధరించకూడదు. అవి ప్రతికూల శక్తిని ఆకర్షిస్తాయి. ఇవాళ శుక్రుడు అస్తమిస్తున్నాడు. అందుకే శుభకార్యాలు, వ్యాపారాలు ప్రారంభించొద్దు’ అని సూచిస్తున్నారు.


