News October 7, 2025
రామాయణం ప్రతి మనిషి జీవితానికి మార్గదర్శక గ్రంథం: ఎస్పీ

మహర్షి వాల్మీకి రచించిన రామాయణం ప్రతి మనిషి జీవితానికి మార్గదర్శక గ్రంథంగా ఉందని భూపాలపల్లి ఎస్పీ కిరణ్ ఖరే అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో మంగళవారం మహర్షి వాల్మీకి జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ కిరణ్ ఖరే వాల్మీకి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వాల్మీకి చూపిన సత్యం, ధర్మం, కర్తవ్యం వంటి మార్గాలు నేటి యువతకు ఆచరణీయమని, వాటిని ప్రతి ఒక్కరూ అనుసరించాలని ఎస్పీ సూచించారు.
Similar News
News January 13, 2026
హైదరాబాద్ ఖాళీ.. కాదు రద్దీ.. మీ కామెంట్?

HYD ఖాళీ అయ్యిందని కొందరి SM పోస్టులు వైరల్ అయ్యాయి. సంక్రాంతి కోసం జనాలు సొంతూళ్లకు వెళ్లారని దీని అర్థం. ఈ పరిస్థితి సిటీలో ఓ వైపు మాత్రమే కనిపిస్తోందని మరికొందరి వాదన. పండుగలకు బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో రద్దీ సాధారణమని, సిటీలో ఏ మూలకు వెళ్లిన ట్రాఫిక్ ఉందని చెబుతున్నారు. పల్లెబాట పట్టిన వీడియోలు, సిటీ రష్ వీడియోలు SMలో పోటీ పడుతున్నాయి. మరి మీ ఏరియాలో పరిస్థితి ఏంటి? కామెంట్ చేయండి.

108 అంబులెన్స్ సేవల బలోపేతంపై కలెక్టర్ సమీక్ష

పెద్దపల్లి జిల్లాలో 108 అత్యవసర వైద్య సేవల పనితీరుపై కలెక్టర్ కోయ శ్రీహర్ష కలెక్టరేట్‌లో మంగళవారం సమీక్ష నిర్వహించారు. జూలపల్లి, రాగినేడు, రామగిరి, కాల్వశ్రీరాంపూర్ PHCలకు అదనపు అంబులెన్సులు కేటాయించాలని, ఇందుకు తగిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఆపదలో ఉన్న వారికి సకాలంలో వైద్య సాయం అందేలా చూడాలని సూచించారు. సమావేశంలో DMHO ప్రమోద్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.