News January 11, 2026

రామారెడ్డి: ఎమ్మెల్యే బ్యాటింగ్.. ఎంపీడీవో బౌలింగ్

image

రామారెడ్డి మండల కేంద్రంలో యువజన నాయకులు నిర్వహిస్తున్న రామారెడ్డి ప్రీమియర్ లీగ్-2026 క్రికెట్ టోర్నమెంట్ శనివారం జరిగింది. మండల పర్యటనలో భాగంగా ఎమ్మెల్యే మదన్‌మోహన్ రావు జడ్పీహెచ్‌ఎస్ బాయ్స్ హై స్కూల్ ప్రాంగణంలో జరిగిన పోటీల్లో పాల్గొని బ్యాటింగ్ చేశారు. నాగిరెడ్డిపేట్ ఎంపీడీవో కురుమ ప్రవీణ్ బౌలింగ్ వేశారు. యువకులతో కలిసి క్రికెట్ ఆడినందుకు ఎమ్మెల్యే ఆనందం వ్యక్తం చేశారు.

Similar News

News January 20, 2026

హైదరాబాద్‌లో 80 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

image

HYDలోని CSIR-CCMB 80 పోస్టులకు షార్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గలవారు JAN 27 -FEB 23 వరకు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు హార్డ్ కాపీని మార్చి 2 వరకు పోస్ట్ చేయవచ్చు. టెక్నీషియన్, టెక్నికల్ అసిస్టెంట్‌కు గరిష్ఠ వయసు 28ఏళ్లు కాగా, టెక్నికల్ ఆఫీసర్ పోస్టుకు 30ఏళ్లు. టెక్నీషియన్‌కు నెలకు రూ.39,545, tech. assist.కు రూ.72,240, tech. ఆఫీసర్‌కు రూ.90,100 చెల్లిస్తారు. వెబ్‌సైట్: www.ccmb.res.in/

News January 20, 2026

ఆదిలాబాద్: ఓపెన్ స్కూల్ పరీక్షా ఫీజు గడువు పెంపు

image

ఉమ్మడి జిల్లాలో మార్చి, ఏప్రిల్లో నిర్వహించే ఓపెన్ స్కూల్ పరీక్షా ఫీజు చెల్లింపు గడువును పొడిగించినట్లు జిల్లా అదనపు కలెక్టర్, ఇన్ఛార్జ్ విద్యాశాఖ అధికారి రాజేశ్వర రావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అపరాధ రుసుము రూ.50తో ఈనెల 25వ తేదీ వరకు, తత్కాల్ ఫీజు చెల్లించేందుకు ఈనెల 26 నుంచి 28వ తేదీ వరకు అవకాశం ఉందన్నారు. అభ్యర్థులు ఈ గడువు పొడిగింపును ఉపయోగించుకోవాలన్నారు.

News January 20, 2026

డాక్టర్లు నిర్లక్ష్యంగా ఉండరాదు: మంత్రి మండిపల్లి

image

రాయచోటి నియోజకవర్గంలోని పేదలకు నాణ్యమైన వైద్యం అందిస్తామని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి చెప్పారు. రాయచోటి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశానికి మంగళవారం ఆయన హాజరయ్యారు. ఆసుపత్రిలో అన్ని విభాగాలకు పరికరాలు సమకూరుస్తామన్నారు. పేదలకు వైద్యం చేయడంలో డాక్టర్లు నిర్లక్ష్యం చేయరాదన్నారు. కార్యక్రమంలో వైద్యులు పాల్గొన్నారు.