News February 3, 2025

రాయచోటి: కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక

image

ప్రజల నుంచి వారి సమస్యలను స్వీకరించి, వాటిని పరిష్కరించేందుకు సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటితో పాటు గ్రామ, మండల, డివిజన్ స్థాయిలో నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

Similar News

News February 9, 2026

NGKL: జిల్లాలో ముగిసిన మున్సిపల్ ప్రచారం

image

జిల్లాలోని మూడు మున్సిపాలిటీల్లో ఎన్నికల బహిరంగ ప్రచారం సోమవారం సాయంత్రం 5 గంటలకు ముగిసింది. ఈ నెల 11న పోలింగ్ జరగనుండగా, అభ్యర్థులు ఇంటింటి ప్రచారంపై దృష్టి పెట్టారు. మైకులు మూగబోవడంతో పోలీసులు మద్యం, నగదు పంపిణీపై గట్టి నిఘా ఏర్పాటు చేశారు. 13న ఫలితాలు వెలువడనున్నాయి.

News February 9, 2026

కల్తీ జరిగింది మీ హయాంలో కాదా: విడదల రజిని

image

AP: కల్తీ నెయ్యి వ్యవహారంలో CM CBNకు మాజీ మంత్రి విడదల రజిని కొన్ని ప్రశ్నలు సంధించారు. ‘2024 JULY 6న వచ్చిన 2 ట్యాంకర్లు, JULY 12న వచ్చిన మరో 2 ట్యాంకర్ల నెయ్యిని TTD ల్యాబ్ పరీక్షించి, నాణ్య‌తా ప్ర‌మాణాలు లేవ‌ని వెనక్కి పంపింది వాస్త‌వం కాదా? ఆ లారీలు దొడ్డిదారిన తిరిగి వ‌చ్చింది మీ పాల‌న‌లోనే క‌దా? ఒక‌వేళ క‌ల్తీ జ‌రిగి ఉంటే అది మీ హ‌యాంలోనే క‌దా? దీనికి మీ స‌మాధాన‌మేంటి?’ అని ట్వీట్ చేశారు.

News February 9, 2026

భూపాలపల్లి: 19 క్రిటికల్, 23 సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాలు

image

మున్సిపాలిటీల్లో ఎన్నికల ప్రచారం ముగుసింది. ఇక పోలింగ్‌కు ఒక రోజు ఉండడంతో 52,726 మంది ఓటర్లు తమ ఓట హక్కు వినియోగించుకునేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 86 పోలింగ్ కేంద్రాల్లో 10మంది ఆర్వోలు, 104మంది పీవోలు, ఎపివొలు104 మంది ఏపీవోలు, 312 మంది ఓపీవోలను నియమించారు. 19 క్రిటికల్, 23సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాలుగా అధికారులు గుర్తించారు.