News May 7, 2025

రాయచోటి: బస్సు, బొలెరో ఢీ.. ఒకరి మృతి

image

అన్నమయ్య జిల్లా బండపల్లి టోల్గేట్ వద్ద బస్సు, బొలెరోను ఢీకొట్టిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో <<16220248>>20 మంది గాయపడ్డారు<<>>. స్థానికుల వివరాల ప్రకారం.. బొలెరో వాహనం టైర్ పగలడంతో డ్రైవర్ రోడ్డు పక్కన నిలిపివేశాడు. దానిని ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. ఈ ఘటనలో గాయపడ్డ వారిలో ఒకరైన రామంజనేయ రెడ్డిని కడప రిమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స ఆయన పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

Similar News

News February 12, 2026

MDK: అందరి చూపు అటువైపే..

image

మున్నిపల్ ఎన్నికల పోలింగ్ ముగియడంతో ఇక అందరి చూపు రేపటి ఓట్ల లెక్కింపుపైనే ఉంది. ఓట్లు బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తం కావడంతో గెలుపోటములపై అభ్యర్థుల్లో టెన్షన్ మొదలైంది. బయటకు తామే గెలుస్తామని చెప్పుకుంటున్నా.. సర్వేల్లో విభిన్న ఫలితాలు రావడం, పోలింగ్ తర్వాత అభ్యర్థులు డైలమాలో పడినట్లు తెలుస్తోంది. ఉమ్మడి జిల్లాలో చాలాచోట్ల ద్విముఖ, త్రిముఖ పోరు, బలమైన నాయకులు ఉండటంతో ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది.

News February 12, 2026

GNT: ఆ 40 మందిలో మీ MLA ఉన్నారా?

image

ఎన్డీఏ ఎమ్మెల్యేల సమావేశంలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. సుమారు 40 మంది ఎమ్మెల్యేల పనితీరు ఆశాజనకంగా లేదని అసహనం వ్యక్తం చేశారు. ఈ జాబితాలో ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు ఉన్నట్లు సమాచారం. పనితీరు మార్చుకోని వారితో నేరుగా మాట్లాడతానని సీఎం వెల్లడించారు. మరి మీ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది? ఆ 40 మందిలో మీ ఎమ్మెల్యే ఉన్నారని అనుకుంటున్నారా కామెంట్ చేయండి.

News February 12, 2026

ఖమ్మం: తాను చనిపోతూ.. ఐదుగురిని బతికించాడు

image

మధిరకు చెందిన బీటెక్ విద్యార్థి కందిమళ్ల విజయకుమార్ ఇటీవల తాడేపల్లి రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్ డెడ్‌కు గురయ్యారు. తీవ్ర విషాదంలోనూ ఆయన కుటుంబ సభ్యులు సాహసోపేత నిర్ణయం తీసుకుని అవయవదానానికి సమ్మతించారు. ఆయన గుండె, కాలేయం, ఊపిరితిత్తులు, రెండు కిడ్నీలు, కార్నియా దానం చేయడంతో ఐదుగురికి ప్రాణదానం లభించింది. విద్యార్థి కుటుంబం చూపిన ఔదార్యాన్ని వైద్యులు, స్థానికులు కొనియాడారు.