News April 12, 2025
రాయలసీమ: రాష్ట్ర స్థాయిలో KGBV విద్యార్థినుల సత్తా

AP ఇంటర్మీడియట్ బోర్డ్ ప్రకటించిన సీనియర్ ఇంటర్ ఫలితాలు శనివారం విడుదలైన విషయం తెలిసిందే. ఈ ఫలితాల్లో కర్నూలు జిల్లా పంచలింగాల KGBVకి చెందిన విద్యార్థినులు రాష్ట్ర స్థాయిలో మొదటి 3 ర్యాంకులు సాధించినట్లు ప్రిన్సిపల్ స్వప్న కుమారి తెలిపారు. మొదటి ర్యాంకులో టీ.మానస 992/1000, 2వ ర్యాంకులో యు. మానస 992/1000, 3వ ర్యాంకులో టీ. సుజాత 981/1000 మార్కులతో నిలిచారు.
Similar News
News April 12, 2026
ఉమ్మడి అనంత జిల్లా ప్రజలు ఉక్కిరిబిక్కిరి

సూర్యుడి ప్రతాపానికి ఉమ్మడి అనంత జిల్లా ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మరోపక్క ఈ నెల 20వ తేదీ వరకు తీవ్రమైన వడగాలులు వీచే అవకాశం ఉందని రేకులకుంట వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. రానున్న 5 రోజుల్లో పగటి ఉష్ణోగ్రతలు 40.2 నుంచి 42.0 డిగ్రీలుగా నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించారు. ప్రజలు అప్రమత్తంగా ఉంటూ నీటిని ఎక్కువగా తీసుకోవాలన్నారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు వడగాలులు వీస్తాయన్నారు.
News April 12, 2026
బీబీనగర్‌లో రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

బీబీనగర్‌లో తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై వేగంగా వచ్చిన గుర్తుతెలియని వాహనం ఒక బైక్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో బైక్‌పై ప్రయాణిస్తున్న వ్యక్తి తీవ్ర గాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతుడి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News April 12, 2026
త్రివిక్రమ్ సినిమాలో విలన్‌గా ధురంధర్-2 నటుడు?

ధురంధర్-2 సినిమాలో రణ్‌వీర్ సింగ్ స్నేహితుడిగా కనిపించిన ఉదయ్ వీర్ సంధును టాలీవుడ్‌కు తీసుకొచ్చేందుకు డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. విక్టరీ వెంకటేశ్ హీరోగా తెరకెక్కుతున్న ‘ఆదర్శ కుటుంబం ఏకే47’లో విలన్ పాత్రకు సంధును ఫైనలైజ్ చేసినట్లు సమాచారం. ధురంధర్-2లో సంధు కొద్దిసేపే కనిపించినా నటనతో ఆకట్టుకున్నారు. ఆయన అంతకుముందు అక్షయ్ కుమార్ ‘గోల్డ్’ మూవీలో కనిపించారు.


