News August 22, 2025

రాయికల్: ఆర్టీసీ బస్సు ఢీకొని దివ్యాంగుడి మృతి

image

రాయికల్ మం. అల్లిపూర్‌కు చెందిన బరతాల రాజేందర్(30) అనే దివ్యాంగుడు RTC బస్సు ఢీకొని మృతిచెందినట్లు ఏఎస్ఐ దేవేందర్ శుక్రవారం తెలిపారు. గ్రామంలో గురువారం రాత్రి రాజేందర్ రోడ్డు దాటుతుండగా అతివేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో తీవ్ర గాయాలైన అతనిని మెరుగైన చికిత్స నిమిత్తం వరంగల్ తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్లు చెప్పారు. మృతుని తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నమన్నారు.

Similar News

News January 19, 2026

కామారెడ్డి అభివృద్ధికి నా తుదిశ్వాస వరకు పాటు పడతా: షబ్బీర్

image

కామారెడ్డి అభివృద్ధికి నా తుది శ్వాస వరకు పాటుపడుతానని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పట్టణ ప్రజల దాహార్తిని తీర్చడం కోసం గతంలో 120 కిలోమీటర్ల దూరం నుంచి గోదావరి జలాలను తీసుకువచ్చానన్నారు. కానీ గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఆ వ్యవస్థను నిర్వీర్యం చేసి మళ్లీ కామారెడ్డికి నీటి కష్టాలు తెచ్చిందన్నారు.

News January 19, 2026

నేటి ముఖ్యాంశాలు

image

❆ BRS, KCRను బొంద పెడితేనే NTRకు నివాళి: రేవంత్
❆ ఫిబ్రవరి 15కు ముందే మున్సిపల్ ఎన్నికలు: పొంగులేటి
❆ రేవంత్ డీఎన్‌ఏలోనే ద్రోహ బుద్ధి ఉంది: హరీశ్‌రావు
❆ వచ్చే ఏడాది జులై 27- ఆగస్టు 3 వరకు గోదావరి పుష్కరాలు
❆ AP: బాబాయ్‌ని చంపినంత ఈజీ కాదు రాజకీయాలు: CM CBN
❆ రాష్ట్ర పరిణామాలపై ప్రధాని జోక్యం చేసుకోవాలి: బొత్స
❆ న్యూజిలాండ్ చేతిలో వన్డే సిరీస్ కోల్పోయిన టీమ్ ఇండియా

News January 19, 2026

మా ఆట నిరాశపరిచింది: గిల్

image

న్యూజిలాండ్‌తో మూడో వన్డేలో తాము ఆడిన విధానం నిరాశపరిచిందని భారత కెప్టెన్ గిల్ అన్నారు. ‘మేం కొన్ని విషయాలను సరిచేసుకోవాలి. విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చేస్తున్న తీరు మాకు సానుకూల అంశం. 8వ స్థానంలో వచ్చి హర్షిత్‌లా ఆడటం అంత సులభం కాదు. వచ్చే ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకొని నితీశ్‌కు మరిన్ని అవకాశాలు ఇవ్వాలి. ఎలాంటి కాంబినేషన్స్ పని చేస్తాయో చూడాలి’ అని <<18892634>>మ్యాచ్ అనంతరం<<>> చెప్పారు.