News November 19, 2025

రాష్ట్రంలోనే ఏలూరు ప్రథమ స్థానం: సాల్మన్ రాజ్

image

ఏలూరు జిల్లాలో పీఎం సూర్యఘర్ పథకం కింద ఇప్పటివరకు 1,00,026 కిలోవాట్ల సామర్థ్యం కలిగిన 31,022 రూఫ్ టాప్ సోలార్ ప్లాంట్లను గ్రిడ్‌కు అనుసంధానించినట్లు ఏపీఈపీడీసీఎల్ సూపరింటెండింగ్ ఇంజినీర్ సాల్మన్ రాజు తెలిపారు. రాష్ట్రంలోనే అత్యధికంగా ఏలూరు జిల్లాలో 4,218 మంది వినియోగదారులు సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేసుకున్నారన్నారు. పథకం సమాచారం కోసం 1912కు కాల్ చేయవచ్చని ఆయన సూచించారు.

Similar News

News January 22, 2026

భారత్‌లో T20 WC ఆడేదే లేదు: బంగ్లాదేశ్

image

ICC T20WC మ్యాచ్‌లు భారత్‌లో ఆడేదే లేదని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు తేల్చి చెప్పింది. వెన్యూ మార్చితే తమ నిర్ణయంలో మార్పు ఉంటుందని పేర్కొంది. తమకు WC ఆడాలని ఉందని, అయితే ఇండియాలో కాదని తెలిపింది. భద్రత దృష్ట్యా తమ మ్యాచ్‌లను శ్రీలంకకు మార్చాలని కోరగా ఐసీసీ ఒప్పుకోని విషయం తెలిసిందే. భారత్‌లో ఆడాల్సిందేనని ICC తేల్చిచెప్పింది. దీంతో ఇవాళ BCB తమ తుది నిర్ణయాన్ని వెల్లడించింది.

News January 22, 2026

నవజాత గొర్రె పిల్లల మరణాలకు కారణం ఏమిటి?

image

నవజాత గొర్రె పిల్లల మరణాలు పెంపకందారులను ఆర్థికంగా దెబ్బతీస్తున్నాయి. పుట్టిననాటి నుంచి 28 రోజుల వయసు కలిగిన గొర్రె పిల్లలను నవజాత పిల్లలుగా పరిగణిస్తారు. నవజాత పిల్లల మరణాల్లో దాదాపు 35 శాతం అవి పుట్టినరోజే సంభవిస్తాయని వెటర్నరీ నిపుణులు చెబుతున్నారు. గొర్రెల పెంపకందారుల నిర్లక్ష్యం, వ్యాధికారక క్రిములు, సూక్ష్మజీవులు, పరాన్న జీవులు సోకడమే ఈ మరణాలకు కారణమని వెటర్నరీ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

News January 22, 2026

రికార్డు సృష్టించిన సంగారెడ్డి రైతు

image

వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో ఎల్లో మిర్చి ధర ఆకాశాన్నంటి కొత్త రికార్డు సృష్టించింది. హత్నూర మండలం పన్యాల గ్రామానికి చెందిన రైతు నారగౌడ్ పండించిన మిర్చికి క్వింటాల్‌ రూ. 42,000 ధర పలికింది. గతంలో ఎప్పుడూ రూ.13 వేల నుంచి 15 వేల లోపే ధర వచ్చేదని, ఈసారి అనూహ్యంగా ఇంత భారీ ధర పలకడంతో రైతు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నాణ్యమైన దిగుబడి ఉంటే మార్కెట్‌లో మంచి లాభాలు వస్తాయని ఈ ధర నిరూపించింది.