News November 19, 2025
రాష్ట్రంలోనే ఏలూరు ప్రథమ స్థానం: సాల్మన్ రాజ్

ఏలూరు జిల్లాలో పీఎం సూర్యఘర్ పథకం కింద ఇప్పటివరకు 1,00,026 కిలోవాట్ల సామర్థ్యం కలిగిన 31,022 రూఫ్ టాప్ సోలార్ ప్లాంట్లను గ్రిడ్‌కు అనుసంధానించినట్లు ఏపీఈపీడీసీఎల్ సూపరింటెండింగ్ ఇంజినీర్ సాల్మన్ రాజు తెలిపారు. రాష్ట్రంలోనే అత్యధికంగా ఏలూరు జిల్లాలో 4,218 మంది వినియోగదారులు సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేసుకున్నారన్నారు. పథకం సమాచారం కోసం 1912కు కాల్ చేయవచ్చని ఆయన సూచించారు.
Similar News
News January 12, 2026
HYD: రూ.60కే సంక్రాంతి సంబరాలు

HYD హైటెక్ సిటీ నడిబొడ్డున పల్లెటూరి పండగ సందడి మొదలైంది. మాదాపూర్ సాఫ్ట్‌వేర్ కుర్రాళ్ల నుంచి ఆటో అన్నల దాకా అందరినీ అలరించేందుకు శిల్పారామం సంక్రాంతి సంబరాలు (జనవరి 13-17) సిద్ధమయ్యాయి. నల్గొండ గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసుల కీర్తనలు, పుట్టపాక చేనేత సిరులతో 65 ఎకరాల ప్రాంగణం అలరిస్తోంది. టికెట్ కేవలం రూ.60 మాత్రమే. ఉదయం 10:30 నుంచి రాత్రి 8 గంటల వరకు మన ఊరి పండగను ఇక్కడే చూసేయండి!

ఇందిరమ్మ ఇండ్ల బిల్లుల కోసం డబ్బులివ్వొద్దు: శ్రీధర్ బాబు

ఇందిరమ్మ ఇండ్ల బిల్లుల పేరుతో ఎవరికీ రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదని సోమవారం మంథని పర్యటనలో మంత్రి శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. ఎల్-1 లబ్ధిదారులకు 4 విడతల్లో రూ.5 లక్షలు నేరుగా బ్యాంక్ ఖాతాల్లో జమ అవుతాయని తెలిపారు. డబ్బులు అడిగే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆర్డీఓకు ఆదేశించారు. ఐదు నెలల్లో 317 మంది లబ్ధిదారులు ఇళ్లు పూర్తి చేసుకుని గృహప్రవేశం చేయాలన్నారు. అవినీతికి తావు లేదని మంత్రి తెలిపారు.