News December 3, 2025
రాష్ట్రంలోనే.. రాజమహేంద్రవరానికి ఫస్ట్ ప్లేస్..!

రాష్ట్రంలో వాయు కాలుష్యం తక్కువ ఉన్న నగరాల్లో రాజమహేంద్రవరం ప్రథమస్థానంలో నిలిచింది. ఈ విషయాన్ని మంగళవారం లోక్‌సభలో కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ ప్రకటించారు. రాజమహేంద్రవరంలో ధూళికణాలు 2017-18లో 85 మైక్రో గ్రాములు ఉండగా.. 2024-25 నాటికి 59 మైక్రోగ్రాములకు తగ్గినట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలో 10 నగరాల్లో కాలుష్యం తగ్గిందన్నారు.
Similar News
News February 8, 2026
రేపు ‘డయల్ యువర్ ఏపీఈపీడీసీఎల్ సీఎండీ’

విద్యుత్ వినియోగదారుల సమస్యల త్వరితగతిన పరిష్కారమే ధ్యేయంగా ‘డయల్ యువర్ సీఎండీ’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తూర్పుగోదావరి ఎస్‌ఈ కె.తిలక్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 9 నుంచి ఈ వినూత్న కార్యక్రమం ప్రారంభం కానుంది. ప్రతి సోమవారం నిర్వహించే ఈ కార్యక్రమంలో భాగంగా.. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఉన్న వినియోగదారులు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లవచ్చని ఆయన పేర్కొన్నారు.
News February 8, 2026
రేపు PGRS రద్దు.. కారణం ఏంటంటే?

ఫిబ్రవరి 9న CM చంద్రబాబు అధ్యక్షతన మంత్రులు-కార్యదర్శుల సదస్సు ఉన్నందున, ఆరోజు జరగాల్సిన PGRS, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలు రద్దు చేసినట్లు తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఆదివారం తెలిపారు. కలెక్టర్లు, SPలు ఈ సదస్సుకు హాజరు కావాల్సి ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. ప్రజలు ఈ మార్పును గమనించాలని, తదుపరి సోమవారం నుంచి ఈ కార్యక్రమాలు యధావిధిగా జరుగుతాయని ఆమె పేర్కొన్నారు.
News February 7, 2026
పుష్కరాలకు సర్వం సిద్ధం చేయాలి: మంత్రి దుర్గేశ్

గోదావరి మహా పుష్కరాలు-2027 రాష్ట్ర ప్రతిష్ఠకు నిదర్శనమని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పక్కా ప్రణాళికతో ఏర్పాట్లు చేయాలని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో కలెక్టర్ కీర్తి చేకూరి, జిల్లా ఎస్పీతో కలిసి ఆయన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. శాఖల మధ్య సమన్వయం ఉండాలని, భక్తుల రద్దీకి అనుగుణంగా మౌలిక వసతులు కల్పించాలని సూచించారు.


