News November 19, 2025
రాష్ట్రపతి పర్యటన.. రేణిగుంటలో విస్తృత తనిఖీలు

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తిరుపతి పర్యటనను దృష్టిలో పెట్టుకుని రేణిగుంట పట్టణంలో భద్రతా చర్యలను పోలీసులు కట్టుదిట్టం చేశారు. ఉన్నాధికారుల ఆదేశాల మేరకు బుధవారం పోలీసులు పట్టణంలోని లాడ్జీలు, హోటళ్లలో ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. అతిథుల నమోదు, సీసీ కెమెరాలు, భద్రతా పరికరాలను పరిశీలించి, అనుమానాస్పద వ్యక్తులపై వివరాలు సేకరించారు. లాడ్జ్ నిర్వాహకులు భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని వారు సూచించారు.
Similar News
News January 19, 2026
SRCL: ‘అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలి’

మైనార్టీ విద్యాలయాల ప్రవేశాల పోస్టర్లను ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆవిష్కరించారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో సోమవారం టీజీఎంఆర్ఐఎస్ ఆధ్వర్యంలో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన ప్రవేశాల పోస్టర్లను ఆమె ఆవిష్కరించారు. అర్హులైన విద్యార్థులు నిర్ణీత గడువులో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
News January 19, 2026
పెద్దపల్లి: ‘ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం పకడ్బందీగా అమలు చేయాలి’

జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సమీకృత జిల్లా కలెక్టరేట్‌లో జిల్లా స్థాయి విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కట్టుదిట్టంగా అమలు చేయాలని తెలిపారు. అన్ని పరిహార చెల్లింపులు సమయానికి పూర్తవ్వాలని, ప్రభుత్వ ప్రతిపాదనలు సమర్పించాలని చెప్పారు. విద్యార్థులు స్కాలర్‌షిప్‌లకు తప్పనిసరిగా దరఖాస్తు చేయాలని, విద్యాసంస్థలకు మౌలిక సదుపాయాలు పటిష్టంగా ఏర్పాటు చేయాలని సూచించారు.
News January 19, 2026
గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఏయూ విద్యార్థులకు పోటీలు

గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్ర విశ్వవిద్యాలయం క్యాంపస్‌లో కళాశాల విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ, చిత్రలేఖనం పోటీలు నిర్వహిస్తున్నారు. ఈనెల 24న ఉదయం 10 గంటలకు NSS భవనంలో వ్యాసరచన, వక్తృత్వ పోటీలు, ఆర్ట్స్ కళాశాల పరిధిలోని చిత్రలేఖన విభాగంలో చిత్రలేఖనం పోటీలను నిర్వహిస్తారు. విజేతలకు 26వ తేదీన బహుమతులు ప్రదానం చేస్తారు. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొనాలని అధికారులు సూచించారు.


