News November 19, 2025
రాష్ట్రపతి పర్యటన.. రేణిగుంటలో విస్తృత తనిఖీలు

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తిరుపతి పర్యటనను దృష్టిలో పెట్టుకుని రేణిగుంట పట్టణంలో భద్రతా చర్యలను పోలీసులు కట్టుదిట్టం చేశారు. ఉన్నాధికారుల ఆదేశాల మేరకు బుధవారం పోలీసులు పట్టణంలోని లాడ్జీలు, హోటళ్లలో ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. అతిథుల నమోదు, సీసీ కెమెరాలు, భద్రతా పరికరాలను పరిశీలించి, అనుమానాస్పద వ్యక్తులపై వివరాలు సేకరించారు. లాడ్జ్ నిర్వాహకులు భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని వారు సూచించారు.
Similar News
News January 20, 2026
తిరుమలలో సాధారణంగా భక్తుల రద్దీ

సంక్రాంతి సెలవులు ముగియడంతో కార్యాలయాలు, స్కూల్స్ ప్రారంభమైయ్యాయి. దీంతో తిరుమల భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతోంది. సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతుండగా.. 20 కంపార్ట్‌మెంట్‌లలో భక్తులు వేచి ఉన్నారు. సోమవారం 79,098 మంది స్వామి వారిని దర్శించుకోగా.. 24,083 మంది స్వామి వారికి తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా రూ.4.16 కోట్లు ఆదాయం వచ్చింది.
News January 20, 2026
2026 పెళ్లి ముహూర్తాలు ఇవే: పండితులు

శుక్ర మౌఢ్యమి కారణంగా ఫిబ్రవరి 17 వరకు ముహూర్తాలు లేవని పండితులు తెలిపారు.
*ఫిబ్రవరి: 19, 20, 21, 24, 25, 26 *మార్చి: 1, 3, 4, 7, 8, 9, 11, 12
*ఏప్రిల్: 15, 20, 21, 25, 26, 27, 28, 29 *మే: 1, 3, 5, 6, 7, 8, 13, 14 *జూన్: 21, 22, 23, 24, 25, 26, 27, 29 *జులై: 1, 6, 7, 11 *AUG నుంచి OCT వరకు చాతుర్మాస్యం, శూన్య మాసం వల్ల ముహూర్తాలు లేవు.
*నవంబర్: 21, 24, 25, 26 *డిసెంబర్: 2, 3, 4, 5, 6, 11, 12
News January 20, 2026
రోడ్డు భద్రతపై నేడు అవగాహన సదస్సు

రోడ్డు నిబంధనలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు భూపాలపల్లి జిల్లా పోలీస్ శాఖ శ్రీకారం చుట్టింది. ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమంలో భాగంగా మంగళవారం పట్టణంలోని లక్ష్మీనరసింహ ఫంక్షన్ హాల్‌లో ప్రత్యేక సదస్సు నిర్వహించనున్నట్లు ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ తెలిపారు. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1:30 వరకు సాగే ఈ సదస్సులో జిల్లా కలెక్టర్‌తో పాటు పలు శాఖల అధికారులు పాల్గొంటారని పేర్కొన్నారు.


