News November 19, 2025
రాష్ట్రపతి పర్యటన.. రేణిగుంటలో విస్తృత తనిఖీలు

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తిరుపతి పర్యటనను దృష్టిలో పెట్టుకుని రేణిగుంట పట్టణంలో భద్రతా చర్యలను పోలీసులు కట్టుదిట్టం చేశారు. ఉన్నాధికారుల ఆదేశాల మేరకు బుధవారం పోలీసులు పట్టణంలోని లాడ్జీలు, హోటళ్లలో ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. అతిథుల నమోదు, సీసీ కెమెరాలు, భద్రతా పరికరాలను పరిశీలించి, అనుమానాస్పద వ్యక్తులపై వివరాలు సేకరించారు. లాడ్జ్ నిర్వాహకులు భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని వారు సూచించారు.
Similar News
News January 21, 2026
NLG: జిల్లా కారాగారానికి నూతన సూపరింటెండెంట్

నల్గొండ జిల్లా కారాగారానికి నూతన సూపరింటెండెంట్‌గా కె. ఆనందరావు నియమితులయ్యారు. గత సూపరింటెండెంట్ పదోన్నతిపై చర్లపల్లి కేంద్ర కారాగారానికి బదిలీ అయ్యారు. కె.ఆనందరావు గతంలో కేంద్ర కారాగారం నిజామాబాద్‌లో విధులు నిర్వహించారు. పరిపాలనా అనుభవం కలిగిన అధికారిగా గుర్తింపు పొందిన ఆయన నల్గొండ జిల్లా కారాగార అభివృద్ధికి కృషి చేస్తారని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
News January 21, 2026
నిర్మల్: ‘పోటీ చేసే అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి’

నిర్మల్ లోని 42 కౌన్సిలర్ స్థానాలకు, ఖానాపూర్‌లోని 12 కౌన్సిలర్ స్థానాలకు, ముధోల్‌లోని 26 కౌన్సిలర్ స్థానాలకు సంబంధించి బీజేపీ తరఫున పోటీ చేసే అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని మున్సిపల్ ఎన్నికల కన్వీనర్ రావుల రామ్నాథ్ సూచించారు. నిర్మల్ వారు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం (గాజుల పేట్), (ముధోల్) భైంసా ఎమ్మెల్యే నివాసం వద్ద, ఖానాపూర్ వాళ్ళు స్థానిక బీజేపీ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు.
News January 21, 2026
శంబర జాతరకు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు

శంబర పోలమాంబ జాతర సందర్భంగా ఎస్పీ ఎస్.వి.మాధవ్ రెడ్డి బుధవారం అమ్మవారి దేవాలయాన్ని సందర్శించారు. ముందుగా పోలమాంబను దర్శించుకున్నారు. అనంతరం పోలీసు అధికారులుతో, దేవదాయ, ఆలయ కమిటీ సభ్యులతో సమావేశమయ్యారు. విధి నిర్వహణలో తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై దిశా నిర్దేశం చేశారు. క్యూలైన్ల వద్ద ఏర్పాటు చేసిన బారికేడ్లు నిశితంగా పరిశీలించి, పటిష్ఠంగా ఏర్పాట్లు చేయాలన్నారు.


