News November 16, 2025
రాష్ట్రపతి హైదరాబాద్ టూర్.. షెడ్యూల్ ఇదే!

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము హైదరాబాద్ పర్యటన షెడ్యూలు ఖరారైంది. ఈనెల 21వ తేదీన బొల్లారంలోని రాష్ట్రపతి భవన్‌లో నిర్వహించే భారతీయ కళా మహోత్సవాన్ని ప్రారంభించనున్నారు. 21న మధ్యాహ్నం 1.10 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకొని రాజ్ భవన్‌కు వెళతారు. ఆ తరువాత మధ్యాహ్నం 3.50 గంటలకు బొల్లారం రాష్ట్రపతి నిలయంలో భారతీయ కళామహోత్సవాన్ని ప్రారంభిస్తారు. మరుసటి రోజు ఉదయం పుట్టపర్తికి వెళతారు.
Similar News
News January 18, 2026
HYD: డాక్టర్ల చీటీ వాళ్లకే అర్థమవుతుంది.. ఎందుకు..?

డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ సామాన్యులకూ అర్థమయ్యేలా ఉండాలని NMC ఇదివరకే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. కాగా, డాక్టర్లు రాసే మందుల చీటీ మెడికల్ షాప్ సిబ్బందికి సులువుగా అర్థమవుతుంది. ఇందుకు ప్రధాన కారణం వారి పని అనుభవమే. రోజూ వందలాది ప్రిస్క్రిప్షన్లు చూసే ఫార్మసిస్టులు డాక్టర్ల చేతిరాత, మందుల అబ్రివేషన్లు, ఫార్ములాలను ఈజీగా గుర్తిస్తారు. మందులపై అవగాహన ఉండటంతో చీటీ చూడగానే టక్కున మాత్రలు ఇచ్చేస్తారు.
News January 18, 2026
హైదరాబాద్‌పై NTR చెరగని ముద్ర

HYDపై మాజీ CM దివంగత NTR చెదరని ముద్ర వేశారు. ట్యాంక్‌బండ్‌లో మనం చూసే బుద్ధ విగ్రహం ఆయన ఆలోచనలోనుంచే పుట్టింది. ఇందులో 1990 మార్చి 10న ప్రపంచంలోనే ఎత్తైన ఏకశిలా బుద్ధ విగ్రహ తొలి ప్రతిష్ఠ విషాదంగా మారింది. అనంతరం 1992లో విజయవంతంగా ప్రతిష్ఠించగా, నేడు అది HYDకు ప్రతీకగా నిలుస్తోంది. సాగరతీరం సౌందర్యవృద్ధికి 1996లో నెక్లెస్ రోడ్డును రూపుదిద్దారు. నేడు ఆయన వర్ధంతి సందర్భంగా HYD ఆయనను స్మరిస్తోంది.
News January 18, 2026
HYD: మేడారం ‘బంగారం’ మీ ఇంటికే

మేడారం జాతర ప్రసాదం (బంగారం) ఇంటి వద్దకు పంపేందుకు HYD ఆర్టీసీ అధికారులు శ్రీకారం చుట్టారు. రూ.299 చెల్లించిన వారికి ప్రసాదంతోపాటు వనదేవతల ఫొటోలు, పసుపు, కుంకుమ అందజేయనున్నారు. TGSRTC ఆన్‌లైన్‌లో భక్తులు తమ వివరాలు నమోదు చేయాలని ఆర్టీసీ HYD అధికారి భద్రినారాయణ తెలిపారు. ఇందుకు సంబంధించి 9154298733, 9154298865 నంబర్లకు ఫోన్ చేయొచ్చన్నారు.
# SHARE IT


