News March 7, 2025
రాష్ట్రస్థాయి కరాటే పోటీల్లో పస్రా విద్యార్థుల ప్రతిభ

గోవిందరావుపేట: కరాటే రాష్ట స్థాయి టోర్నమెంటు పోటీల్లో పస్రా ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబర్చారు. కరాటే కటాస్ కలర్ బెల్ట్ సీనియర్ విభాగంలో రుష్మిత, సాయిచందన, శ్రావ్య, వైష్ణవి మొదటిస్థానంలో నిలిచారు. వైట్ బెల్ట్ బాలురు సీనియర్ విభాగంలో చాతుర్య గొంది దీక్షిత ప్రథమ స్థానంలో నిలిచారు. వైట్ బెల్ట్ జూనియర్ విభాగంలో మనోజ్, భాస్కర్ ప్రథమ సాధించారు.
Similar News
News December 13, 2025
భారత్‌పై టారిఫ్‌లు.. ట్రంప్‌పై వ్యతిరేకత

భారత్‌పై 50% టారిఫ్‌లు విధించిన US అధ్యక్షుడు ట్రంప్‌పై ఆ దేశ చట్టసభలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ సుంకాలను రద్దు చేయాలని ప్రతినిధుల సభ సభ్యులు డెబోరా, మార్క్ విసీ, కృష్ణమూర్తి తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ టారిఫ్‌లు చట్టవిరుద్ధమని, INDతో సంబంధాలకు నష్టమని విమర్శించారు. <<18529624>>పుతిన్-మోదీ<<>> భేటీపైనా USలో ప్రకంపనలు వస్తోన్న విషయం తెలిసిందే. ఈ పరిణామాలు ట్రంప్‌కు ఎదురుదెబ్బేనని నిపుణులు అంటున్నారు.
News December 13, 2025
ఖమ్మం: భార్యాభర్తలే సర్పంచ్, ఉప సర్పంచ్

బోనకల్ పంచాయతీలో బీఆర్‌ఎస్ అభ్యర్థి బానోతు జ్యోతి సర్పంచ్‌గా గెలుపొందారు. ఆమె కాంగ్రెస్ అభ్యర్థి మంగమ్మపై 932 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఇదే పంచాయతీలో జ్యోతి భర్త కొండ ఉప సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గత ఎన్నికల్లో ఓటమిపాలైన కొండ, ఈసారి రిజర్వేషన్ జనరల్ మహిళా కావడంతో సతీమణిని బరిలో నిలిపి, సర్పంచ్ పీఠాన్ని సొంతం చేసుకున్నారు. గతంలో సీపీఎం తరఫున జడ్పీటీసీగా గెలిచారు.
News December 13, 2025
KNR: 567 మంది మహిళలు మాయం

కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో Jan 2024 నుంచి Oct 2025 వరకు 567 మంది మహిళలు, యువతుల మిస్సింగ్ కేసులు నమోదయ్యాయి. ఇవేగాకుండా పోలీసుల దృష్టికి రానివి అనేకం ఉన్నట్లు తెలుస్తోంది. వీటిలో కొన్ని కేసులు పోలీసులు చేదిస్తే చాలా కేసులు మిస్టరీగానే ఉండిపోతున్నాయి. అదృశ్యమైన వారు ఎక్కడికి వెళ్తున్నారు, ఏమైపోతున్నారనేది అంతుచిక్కట్లేదు. కొందరు రాష్ట్రాలు, దేశ సరిహద్దులు దాటుతున్నట్లుగా అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.


