News October 29, 2024
రాష్ట్రస్థాయి పోటీలకు లక్షెట్టిపేట గురుకుల విద్యార్థిని

స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లాలో నిర్వహించిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్థాయి వాలీబాల్ పోటీల్లో లక్షెట్టిపేటలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో చదువుతున్న ఎస్. బ్లేస్సినా ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైంది. ఈ నెల 29 నుంచి 30 వరకు గోదావరిఖనిలో జరగనున్న అండర్-17 రాష్ట్ర స్థాయి పోటీల్లో బ్లేస్సినా పాల్గొననున్నట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రామ కళ్యాణి, పీఈటీ మమత తెలిపారు.
Similar News
News November 12, 2025
ఆదిలాబాద్: పనులను నిర్ణీత గడువులో పూర్తిచేయాలి

ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టిన మౌలిక సదుపాయాల పనులను నిర్ణీత గడువులో పూర్తిచేయాలని కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో బజార్‌హత్నూర్, ఇంద్రవెల్లి, తలమడుగు, తాంసి, ఉట్నూర్ మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలలలో మౌలిక సదుపాయాల పురోగతిపై రెండవ దశ సమీక్షా సమావేశం నిర్వహించారు. విద్యార్థుల భవిష్యత్తు బలోపేతానికి పాఠశాలల్లో సమగ్ర మౌలిక సదుపాయాలు తప్పనిసరి అన్నారు.
News November 12, 2025
ADB: కౌలు రైతులు వెంటనే పంట నమోదు చేసుకోవాలి

ఆదిలాబాద్ జిల్లాలోని కౌలు రైతులు అలాగే డిజిటల్ సంతకం లేని భూములు, పీపీ భూములు, పార్ట్–3 భూములు కలిగిన రైతులు వెంటనే పంట నమోదు చేసుకోవాలని కలెక్టర్ రాజర్షి షా సూచించారు. కనీస మద్దతు ధరకు తమ పంటను విక్రయించే అవకాశాన్ని కోల్పోకుండా ఈ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. కౌలు రైతులు తమ పంటను సీసీఐ కేంద్రాల్లో అమ్మకానికి నమోదు చేసుకోవాలంటే ఏఈఓ వద్ద వివరాలు నమోదు చేసుకోవాలని వివరించారు.
News November 12, 2025
ఉట్నూర్: తండ్రిని చంపిన కొడుకుకి 7ఏళ్ల జైలు శిక్ష

ఉట్నూర్ మండలం రాజన్న గూడకు చెందిన గడ్డం భగవాన్ 2024 సెప్టెంబర్ 13న మద్యం మత్తులో తండ్రిని చంపాడు. డబ్బుల కోసం తలపై దాడిచేయడంతో చికిత్స పొందుతూ అతడి తండ్రి మృతి చెందాడు. కేసు నమోదు చేసిన ఉట్నూర్ పోలీసులు నిందితుడిని కోర్టులో హాజరుపర్చగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రభాకర్ రావు అతడికి 7ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ.1000 జరిమానా విధించారు.


