News November 20, 2025
రాష్ట్రస్థాయి బేస్‌బాల్ పోటీలకు తాజ్ బాబా ఎంపిక

రుద్రవరం ఆదర్శ పాఠశాల పదో తరగతి విద్యార్థి ఎం.తాజ్ బాబా రాష్ట్రస్థాయి అండర్-17 బేస్‌బాల్ పోటీలకు ఎంపికయ్యాడు. నంద్యాలలో జరిగిన జిల్లాస్థాయి పోటీల్లో చూపిన అత్యుత్తమ ప్రతిభ ఆధారంగా ఈ అర్హత లభించిందని ప్రిన్సిపల్ సంగెపు నాగేశ్వరరావు తెలిపారు. తాజ్ బాబా రాష్ట్రస్థాయిలో మరింత రాణించి జాతీయ స్థాయికి చేరాలని ఉపాధ్యాయ బృందం అభినందించింది.
Similar News
News January 22, 2026
త్వరలో జలమండలి విస్తరణ షురూ!

జీహెచ్ఎంసీ పునర్విభజనతో జలమండలి విస్తరణ కూడా షురూ కానుంది. శివారు ప్రాంతాల విలీనంతో జలమండలి తన సేవలను విస్తరించేందుకు సిద్ధమవుతోంది. కొత్త జోన్లు, సర్కిళ్ల ఏర్పాటుతో సేవలు మరింత విస్తృతం చేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఇప్పటికే 12 కొత్త జోన్లు, 60 సర్కిల్లను ఏర్పాటు చేసేందుకు అధికారులు కసరత్తు పూర్తి చేశారు. త్వరలోనే ప్రభుత్వానికి నివేదిక సమర్పించి, జలమండలి విస్తరణకు ముహూర్తం ఖరారు చేయనున్నారు.
News January 22, 2026
బాపట్ల: యువకుడి వేధింపులతో యువతి ఆత్మహత్యాయత్నం

భట్టిప్రోలు మండలంలోని ఓ గ్రామంలో యువకుడి వేధింపులు తాళలేక ఓ యువతి ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆమె బంధువుల వివరాల మేరకు.. గ్రామానికి చెందిన ఆకాష్ అశ్లీల మెసేజ్‌లు పెడుతూ, సర్టిఫికెట్ల సాకుతో లైంగికంగా వేధిస్తున్నాడని గతంలో పోలీసులు హెచ్చరించారు. ఐనా అతని తీరు మారలేదు. ఈనెల 17న ఆమె మనస్తాపంతో గడ్డిమందు తాగింది. ప్రస్తుతం రేపల్లె ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది.
News January 22, 2026
రామగుండం కార్పొరేషన్ ఎన్నికలకు అధికారిక ఏర్పాట్లు

రామగుండం కార్పొరేషన్‌లోని 60 డివిజన్లలో 1,83,049 ఓటర్లు ఉన్నారు. దీనికి సంబంధించి అధికారికంగా అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. 277 పోలింగ్ సెంటర్లు, 680 బ్యాలెట్ బాక్సులు, నలుగురు జోనల్ ఆఫీసర్లు, 15 మంది సెక్టోరియల్ ఆఫీసర్లు, రెండు ఫ్లయింగ్ సర్వే లైన్ టీమ్, 2 స్టాస్టిక్ సర్వే లైన్ టీమ్, 32 రిటర్నింగ్ ఆఫీసర్లు, 32 సహాయ రిటర్నింగ్ ఆఫీసర్లు, 311 ప్రిసైడింగ్ ఆఫీసర్లు, 914 పోలింగ్ సిబ్బందిని నియమించారు.


