News May 2, 2024
రాష్ట్రస్థాయి రెజ్లింగ్ పోటీలకు జొన్నలగడ్డ విద్యార్థుల ఎంపిక

రాష్ట్రస్థాయి రెస్లింగ్ పోటీలకు జొన్నలగడ్డ జడ్పీ పాఠశాల విద్యార్థులు ఎంపికైనట్లు హెచ్‌ఎం మల్లికార్జునరావు గురువారం తెలిపారు. గత నెల 28వ తేదీన నరసరావుపేటలో జరిగిన జిల్లా స్థాయి పోటీల్లో వీరు పాల్గొన్నారు. ఈనెల 3, 4 తేదీల్లో చిత్తూరు జిల్లాలో జరిగే పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థులను, పీఈటీ సునీల్‌ను హెచ్ఎం, గ్రామ పెద్దలు అభినందించారు.
Similar News
News December 9, 2025
గుంటూరు NHM–NTEP పోస్టుల ఎంపిక జాబితా విడుదల

గుంటూరు జిల్లాలో ఎయిడ్స్, టి.బి విభాగంలో ఖాళీలకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను విడుదల చేసినట్లు జిల్లా DMHO విజయలక్ష్మి తెలిపారు. ఎంపికైన వారు డిసెంబర్ 10న మధ్యాహ్నం 2.30 గంటలకు అసలు సర్టిఫికెట్లతో గుంటూరు DMHO కార్యాలయంలో అభ్యర్థులు సమయానికి హాజరుకావాలని సూచించారు. ఎంపిక జాబితా జిల్లా అధికారిక వెబ్‌సైట్ guntur.ap.gov.inలో అందుబాటులో ఉందన్నారు. ఎంపిక ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా జరిగిందని తెలిపారు.

ప్రతి గురువారం కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్: మంత్రి అనగాని

రెవెన్యూ సమస్యలపై ప్రతి గురువారం కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తామని మంత్రి అనగాని సత్యప్రసాద్ మంగళవారం సచివాలయంలో తెలిపారు. గత ప్రభుత్వం చేసిన తప్పులను సరిదిద్దడానికి సమయం పడుతోందని, రిజిస్ట్రేషన్ శాఖలో పూర్తిస్థాయి మార్పులతో తప్పులకు ఆస్కారం లేని వ్యవస్థను తీసుకువస్తామన్నారు. రైతులకు త్వరగా పాస్ పుస్తకాలు జారీ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్లు ఆయన పేర్కొన్నారు.