News December 15, 2025
రాష్ట్ర స్థాయిలో కర్నూలు జిల్లాకు మూడవ స్థానం

అనంతపురం జిల్లాలో జరిగిన ఐదవ రాష్ట్రస్థాయి డాన్స్ స్పోర్ట్స్ పోటీలలో కర్నూలు జిల్లాకు మూడో స్థానం లభించినట్లు రాష్ట్ర సంఘం కార్యదర్శి సురేంద్ర ఆదివారం తెలిపారు. జిల్లా కార్యదర్శి నాగేశ్వరి మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ డాన్స్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన అన్ని పోటీలలో కర్నూలు జిల్లా క్రీడాకారులు మెరుగైన ప్రతిభ సాధించినట్లు తెలిపారు. సభ్యులు అమరేశ్, శ్రీనివాస్ తదితరులు అభినందించారు.
Similar News
News January 19, 2026
కర్నూలు కలెక్టరేట్‌లో 270 ప్రజా ఫిర్యాదుల స్వీకరణ

కర్నూలు కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (PGRS)కు మొత్తం 270 అర్జీలు అందినట్లు డీఆర్వో వెంకట నారాయణమ్మ వెల్లడించారు. వీటిలో అత్యధికంగా రెవెన్యూ క్లినిక్‌కు సంబంధించి 167 అర్జీలు వచ్చాయని తెలిపారు. ప్రజల నుంచి స్వీకరించిన ఈ అర్జీలను ఆయా శాఖల వారీగా వర్గీకరించి, నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు ఆమె పేర్కొన్నారు.
News January 19, 2026
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 93 అర్జీలు

కర్నూలు ఎస్పీ క్యాంపు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 93 ఫిర్యాదులు అందాయి. డీఐజీ, జిల్లా ఇన్‌ఛార్జి ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఫిర్యాదుదారులతో నేరుగా మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఫిర్యాదుపై త్వరితగతిన విచారణ జరిపి చట్టపరంగా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ హుస్సేన్ పీరా, పలువురు సీఐలు పాల్గొన్నారు.
News January 19, 2026
కర్నూలు జిల్లా జనరల్ సెక్రటరీగా సుందర్ రాజు నియామకం

సమాచార హక్కు చట్టం–2005 కర్నూలు జిల్లా జనరల్ సెక్రటరీగా ఆదోని వాసి కె.సుందర్‌రాజును జిల్లా అధ్యక్షుడు కిశోర్ సోమవారం నియమించారు. సుందర్‌రాజు మాట్లాడుతూ.. ప్రభుత్వ కార్యాలయాల్లో సమాచారం పొందే హక్కు ప్రతి భారత పౌరుడికి ఉందన్నారు. అవినీతిని నిర్మూలించి పారదర్శకత, జవాబుదారితనాన్ని పెంచడంలో ఆర్టీఐ చట్టం ఎంతో ఉపయుక్తమన్నారు. చట్ట సభ్యులపై దాడులకు పాల్పడితే సెక్షన్ 6(j) ప్రకారం కేసులు నమోదవుతాయన్నారు.


