News September 10, 2025
రాష్ట్ర స్థాయిలో 13వ ర్యాంక్ సాధించిన జగిత్యాల విద్యార్థిని

జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం మొగిలిపేట గ్రామానికి చెందిన శ్రీ పెరంబుదిరి శ్రీనిత పీజీ కెమిస్ట్రీ ప్రవేశ పరీక్షలో రాష్ట్రస్థాయిలో 13వ ర్యాంక్ సాధించారు. తెలంగాణ సీపీగెట్ నిర్వహించిన ఈ పరీక్షలో ఎలాంటి కోచింగ్ లేకుండా గ్రామీణ ప్రాంతానికి చెందిన విద్యార్థిని ఇంత మంచి ర్యాంకు సాధించడం పట్ల గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News December 14, 2025
కామారెడ్డి జిల్లా 1PM UPDATE @ 77.62 శాతం

కామారెడ్డి జిల్లాలో రెండో విడత ఎన్నికల్లో భాగంగా మధ్యాహ్నం ఒంటి గంట వరకు (పోలింగ్ సమయం ముగిసే సమయానికి) 7 మండలాల్లో నమోదైన పోలింగ్ శాతం మండలాల వారీగా ఇలా ఉంది. గాంధారి-73.23%, లింగంపేట-82.20%, మహమ్మద్ నగర్-83.33%, నాగిరెడ్డిపేట-85.88%, నిజాంసాగర్-86.89%, పిట్లం-61.10%, ఎల్లారెడ్డి-87.81% పోలింగ్ నమోదైనట్లు అధికారులు చెప్పారు. మొత్తం 77.62%గా పోలింగ్ నమోదయ్యిందని వెల్లడించారు.
News December 14, 2025
NZB: ఓటు హక్కు వినియోగించుకున్న BJP జిల్లా అధ్యక్షుడు

రెండో విడుత సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా బీజేపీ NZB జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ కులాచారి ఆదివారం ఓటు హక్కు వినియోగించుకున్నారు. సొంత గ్రామమైన అమృతపూర్‌లో ఓటు వేశారు. దినేష్ కులాచారి మాట్లాడుతా.. ఈ రోజు నా సొంత గ్రామంలో ఓటు వేయడం సంతోషంగా ఉందన్నారు. గ్రామానికి సేవ చేసే వారికీ నా మద్దతు ఉంటుందని పేర్కొన్నారు.
News December 14, 2025
15 రోజుల్లో ‘అవుకు’ లీకేజీలకు మరమ్మతు పూర్తి : జనార్దన్ రెడ్డి

AP: నంద్యాల జిల్లా అవుకు రిజర్వాయర్‌ను మంత్రి జనార్దన్ రెడ్డి సందర్శించారు. ‘15 ఏళ్లుగా రిజర్వాయర్లో లీకేజీల సమస్య ఉంది. గత ప్రభుత్వం పట్టించుకోలేదు. లీకేజీలు లేకుండా మరమ్మతు చేయిస్తున్నాం. ఇప్పటికే నిపుణులు వాటిని గుర్తించి కాంక్రీట్‌తో ఫిల్ చేస్తున్నారు’ అని మంత్రి తెలిపారు. ఇటీవల కట్ట కొద్దిగా కుంగడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారన్నారు. 15 రోజుల్లో పనులు పూర్తవుతాయని, భయపడొద్దని సూచించారు.


