News November 30, 2025

రాష్ట్ర హక్కుల కోసం పోరాడండి: YS జగన్

image

AP: పార్లమెంటులో రాష్ట్ర హక్కుల కోసం పోరాడాలని YCP అధినేత జగన్ పార్టీ MPలకు సూచించారు. రేపటి నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో.. మొంథా తుఫాన్ వల్ల పంట నష్టం, మద్దతు ధర, రైతులపై ఆర్థిక భారం వంటివి ప్రధాన సమస్యలుగా చర్చించాలన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, సంక్షేమ హాస్టళ్లలో పరిస్థితులు, పోలీస్ వ్యవస్థ దుర్వినియోగంపైనా ఎంపీలు తమ గళం వినిపించాలని ఆదేశించారు.

Similar News

News February 19, 2026

మానవాభివృద్ధిలో AI కీలక మలుపు: మోదీ

image

మానవాభివృద్ధిలో AI కీలక మలుపు అని ఢిల్లీ సమ్మిట్‌లో మోదీ అన్నారు. మనుషులు, టెక్ కలిసి పనిచేసే దశలోకి ప్రవేశిస్తున్నామన్నారు. ఈ విప్లవాన్ని శాసించేందుకు పెద్ద విజన్ అవసరమని పేర్కొన్నారు. ఈ జర్నీలో భారత్ కేవలం భాగంగానే కాకుండా ముందుండి నడిపిస్తోందన్నారు. ఈ కొత్త సాంకేతికత మనుషుల్ని ముడి పదార్థాలుగా మార్చే అవకాశం ఇవ్వొద్దన్నారు. ఏ టెక్నాలజీ అయినా కంట్రోల్‌లో ఉండాలంటూ AI నియంత్రణను ప్రస్తావించారు.

News February 19, 2026

T20 WCలో ఆడనున్న బంగ్లాదేశ్.. ఎప్పుడంటే?

image

టీ20 వరల్డ్ కప్-2028కి అర్హత సాధించిన 12 జట్ల పేర్లను ICC ప్రకటించింది. ఈ లిస్టులో భారత్, NZ, AUS, PAK, శ్రీలంక, SA, AFG, ENG, ఐర్లాండ్, WI, ZIM, బంగ్లాదేశ్ ఉన్నాయి. WC-26లో సూపర్-8కి వెళ్లిన 8 జట్లు, 2028 WC హోస్ట్ నేషన్స్ (AUS, NZ)తో పాటు టీ20 ర్యాంకింగ్స్ ఆధారంగా 3 జట్లను (AFG, BAN, IRE) తీసుకున్నట్లు వివరించింది. మరో 8 జట్లు క్వాలిఫయర్ మ్యాచుల ద్వారా ఎంపిక కానున్నాయి.

News February 19, 2026

JIPMERలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు

image

జవహర్‌లాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్& రీసెర్చ్(<>JIPMER)<<>>లో 10 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో DM, MD, MChఅర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 50ఏళ్లు. FEB 24న మెరిట్ లిస్ట్ విడుదల చేసి, FEB 27న ఇంటర్వ్యూకు పిలుస్తారు. నెలకు రూ.1,42,506 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://jipmer.edu.in