News March 8, 2025

రాష్ట్ర హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిని కలిసిన కలెక్టర్

image

తెలంగాణ రాష్ట్ర తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి, రాష్ట్ర లీగల్ సర్వీస్ అథారిటీ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ జస్టిస్ సుజోయ్ పాల్ హనుమకొండకు శనివారం విచ్చారు. ఈ సందర్భంగా హనుమకొండ జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య వారిని మర్యాదపూర్వకంగా కలుసి మొక్కను అందజేసి స్వాగతం పలికారు. అనంతరం వరంగల్, హనుమకొండ జిల్లాలకు చెందిన న్యాయమూర్తులు, జిల్లా అధికారులు ప్రధాన న్యాయమూర్తిని మర్యాదపూర్వకంగా కలిశారు.

Similar News

News January 16, 2026

కర్నూలు: మద్యం బాబులూ.. మీకు చిత్తడే..!

image

కర్నూలు జిల్లా వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను ముమ్మరం చేశారు. డీఐజీ, జిల్లా ఇన్‌ఛార్జ్ ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు అనుమానాస్పద వాహనాలను ఆపి బ్రీత్ అనలైజర్‌తో పరీక్షలు నిర్వహిస్తున్నారు. మద్యం తాగి వాహనాలు నడిపిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు.

News January 16, 2026

కనుమ రోజు ఏ దేవుడిని పూజించాలంటే?

image

కనుమ నాడు పశువుల దైవమైన కాటమరాజుని, సకల దేవతా స్వరూపమైన కామధేనువును భక్తి శ్రద్ధలతో పూజించాలని పండితులు సూచిస్తున్నారు. పశుసంపదను చల్లగా చూడమని కోరుతూ ఊరి పొలిమేరల్లో మొక్కులు చెల్లిస్తారు. ఇలా చేస్తే పంటలు సమృద్ధిగా పండుతాయని నమ్మకం. ఈ రోజున పశువులను అందంగా అలంకరించి, వాటికి దిష్టి తీసి ఆయురారోగ్యాలు కలగాలని ప్రార్థిస్తారు. పిండివంటల తర్వాత కనుమ నాటి మాంసాహార విందులతో పండుగ సందడి ముగుస్తుంది.

News January 16, 2026

20 శాతం పెరగనున్న డిఫెన్స్ బడ్జెట్!

image

2026-27 ఆర్థిక సంవత్సరంలో డిఫెన్స్ బడ్జెట్‌ను 20% పెంచాలని భారత రక్షణ శాఖ కోరుతోంది. గత ఏడాది కేంద్రం రూ.6.81 లక్షల కోట్ల కేటాయించగా.. ఈసారి మరింత ఖర్చు అవసరమని పేర్కొంది. గత బడ్జెట్ తీరులను చూస్తే 20 శాతం పెంపు అంటే అతిగా ఆశ పడటమే అని విశ్లేషకులు అంటున్నారు. అయితే <<18845622>>ఆపరేషన్ సిందూర్‌<<>>తో పాటు ప్రపంచ వ్యాప్తంగా మారుతున్న పరిస్థితుల దృష్ట్యా బడ్జెట్‌లో కేటాయింపులు పెరగాలని పలువురు భావిస్తున్నారు.