News March 24, 2024
రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే లక్ష్యం: మంత్రి సీతక్క

నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని ఓ ఫంక్షన్ హాల్లో ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అధ్యక్షతన విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పంచాయతీ రాజ్, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే లక్ష్యంగా రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కార్యకర్తలంతా సైనికుల్లా పని చేయాలన్నారు. దేశం కోసం గాంధీ కుటుంబం అనేక త్యాగాలు చేసిందన్నారు.
Similar News
News December 11, 2025
వరంగల్ జిల్లాలో 61% పోలింగ్ @11AM

మొదటి విడత స్థానిక సంస్థల ఎన్నికలకు గాను జిల్లాలో ఉదయం 11 గంటల వరకు 61% పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. పర్వతగిరిలో 65.57, రాయపర్తిలో 59.78, వర్ధన్నపేటలో 57.45% నమోదయింది. కాగా, పోలింగ్‌కు ఇంకా రెండు గంటలు మాత్రమే సమయం ఉండటంతో ఓటర్లు పోలింగ్ కేంద్రాల్లో బారులు తీరి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.
News December 10, 2025
WGL: పల్లెల్లో ఎన్నికల పండగ..!

ఉమ్మడి WGL జిల్లాలో మూడు విడతల పంచాయతీ ఎన్నికల్లో భాగంగా గురువారం తొలి విడత జరగనుంది. పల్లెల్లో ఎన్నికల పర్వం పండగ వాతావరణం సృష్టించగా, అభ్యర్థుల గుణగణాల మీద చర్చలు జోరందుకున్నాయి. పార్టీ రహితంగా ఎన్నికలు జరుగుతున్నా, అభ్యర్థులు పార్టీ కండువాలతోనే ప్రచారం చేస్తూ ఊర్లో రాజకీయాలను వేడెక్కిస్తున్నారు. బయట ఉన్న ఓటర్లకు ఫోన్లు చేసి రానుపోను ఖర్చులు ఇస్తామని చెబుతున్నారు.
News December 10, 2025
WGL: నా గుర్తు స్టూల్.. ఇదిగో నీకో కుర్చీ..!

జిల్లాలోని వర్ధన్నపేట మండలం ల్యాబర్తీ గ్రామంలో ఓటర్లను ఆకర్షించేందుకు వార్డు అభ్యర్థులు తగ్గేదేలే అంటున్నారు. మొన్నటికి మొన్న ఓ పార్టీ క్వార్టర్ మందు ఇస్తే మరో పార్టీ అర కిలో చికెన్ ఇచ్చి ఆకర్షించింది. ఇక మరో వార్డు అభ్యర్థి తనకు గుర్తు కుర్చీ కేటాయించడంతో ఏకంగా ఓటర్లకు కుర్చీలను పంచి పెట్టడం వైరల్‌గా మారింది. ఆటోలో ఇంటింటికీ తిరుగుతూ ఒక్కో ఓటుకు ఒక్కో కూర్చి ఇచ్చి తన గుర్తు ఇదే అంటున్నాడు.


