News September 12, 2025

రింగ్ రైల్‌‌తో మారనున్న HYD రూపురేఖలు

image

సిటీలో ఇపుడు ఔటర్ రింగ్ రోడ్ 158 కిలో మీటర్లు.. ఆ తర్వాత రూ.362 రీజినల్ రింగ్ రోడ్.. దీని చుట్టూ రింగ్ రైల్ ప్రతిపాదనలు.. ఇవి అన్నీ పూర్తైతే నగర స్వరూపమే మారిపోతుంది. కొత్త కార్పొరేట్ సంస్థలు, పరిశ్రమలు, కాలేజీలు, మాల్స్ ఇలా ఎన్నెన్నో వస్తాయి. ఇదే జరిగితే దేశం మొత్తం సిటీవైపే చూస్తుంది. HYD అలా తయారుకావాలని మనమూ కోరుకుందాం. మీరేమంటారు?

Similar News

News December 16, 2025

కర్నూలు: నడిరోడ్డుపై పసికందు.!

image

కర్నూలులో అమ్మ తనానికే మచ్చ తెచ్చే అవానవీయ ఘటన జరిగింది. నవ మాసాలు మోసి కన్న నెలలు నిండని పాపను రోడ్డుపై పడేసిందో కసాయి తల్లి. మంగళవారం ఉదయం నాలుగో పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎల్ పేట రోడ్డుపై పాపను గుర్తించి సామాజిక కార్యకర్త అక్కున చేర్చుకున్నాడు. అనంతరం చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి అప్పగించారు.

News December 16, 2025

ఆరోగ్య భద్రతకు డిజిటల్ హెల్త్ రికార్డులు: CBN

image

AP: ప్రజల ఆరోగ్య భద్రతకు సంజీవని ప్రాజెక్టు కింద డిజిటల్ హెల్త్ రికార్డులు రూపొందిస్తున్నట్లు CM CBN తెలిపారు. రియల్ టైమ్‌లోనే ఆరోగ్య వివరాలు తెలుసుకునేలా సంజీవని ద్వారా ఇంటిగ్రేట్ చేస్తున్నామన్నారు. ‘రోగాలను ముందుగా నిరోధించే ప్రివెంటివ్ టెక్నాలజీస్‌పై దృష్టి పెట్టాలి. యోగా, నేచురోపతిని ప్రోత్సహించాలి. డిజిటల్ ఏఐ ఎనేబుల్డ్ హెల్త్, హెల్త్ ఫైనాన్సింగ్ రిఫార్మ్స్‌పై దృష్టి పెట్టాలి’ అని సూచించారు.

News December 16, 2025

34ఏళ్లకే బిలియనీర్ అయిన మీషో CEO

image

ప్రముఖ E-కామర్స్ ప్లాట్‌ఫాం Meesho కో-ఫౌండర్, CEO విదిత్ ఆత్రే 34ఏళ్లకే బిలియనీర్‌గా మారారు. ఇటీవల స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన మీషో షేర్లు ఇష్యూ ధర రూ.111 నుంచి రూ.193కు ఎగబాకడంతో ఆయన నెట్‌వర్త్ 1B డాలర్లను దాటింది. కంపెనీలో 11.1 శాతం వాటా కలిగిన ఆత్రే షేర్ల విలువ ప్రస్తుతం సుమారు రూ.9,128 కోట్లుగా ఉంది. మరో కో-ఫౌండర్ సంజీవ్ బర్న్‌వాల్ సంపద కూడా భారీగా పెరిగి రూ.6,099 కోట్లకు చేరుకుంది.