News August 5, 2024

రిటర్నింగ్ అధికారిగా విశాఖ జేసీ

image

ఉమ్మడి విశాఖ జిల్లా ఉప ఎన్నికకు రిటర్నింగ్ అధికారిగా జేసీ కె.మయూరి అశోక్ వ్యవహరించనున్నట్లు అధికారులు తెలిపారు. ఆయన ఛాంబర్‌లోనే నామినేషన్ పత్రాలు స్వీకరించనున్నారు. ఈ నెల 6న నోటిఫికేషన్ జారీ చేస్తారు. 13 వరకు నామినేషన్ పత్రాలు స్వీకరిస్తారు. 14 నుంచి 16 వరకు ఉపసంహరణకు గడువు ఉంది. ఆగస్టు 30న ఎన్నిక జరుగుతుంది. సహాయ రిటర్నింగ్ అధికారులుగా విశాఖ, అనకాపల్లి, అల్లూరి జిల్లాల డీఆర్ఓలు ఉంటారు.

Similar News

News December 11, 2025

విశాఖ వేదికగా పెన్షన్ అదాలత్

image

విశాఖపట్నంలో డిసెంబర్ 19న ‘పెన్షన్ అదాలత్’ కార్యక్రమం జరగనుంది. సిరిపురం వుడా చిల్డ్రన్స్ థియేటర్‌లో జరిగే ఈ సదస్సుకు ఏపీ ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ శ్రీమతి ఎస్.శాంతి ప్రియ హాజరవుతారు. పెన్షనర్ల సమస్యల పరిష్కారం, డీడీవోలకు సరైన మార్గనిర్దేశం చేయడం దీని ప్రధాన ఉద్దేశం. ఉద్యోగులు, పెన్షనర్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు.

News December 11, 2025

సింహాచలంలో నెల గంట ముహూర్తం ఎప్పుడంటే ?

image

సింహాచలం శ్రీవరాహ లక్ష్మీ నృసింహ స్వామివారి సన్నిధిలో నెలగంట ఉత్సవాన్ని ఈనెల 16వ తేదీ మధ్యాహ్నం 1:01 గంటకు శాస్త్రోక్తంగా ప్రారంభించనున్నట్లు ఆలయ వైదిక సభ్యులు తెలిపారు. ఈ ధనుర్మాసంలో ఆలయంలో 10 రోజులు పగల్ పత్తు, మరో 10 రోజులు రాపత్తు ఉత్సవాలు జరుగుతాయని చెప్పారు. మరో ఐదు రోజులు దారోత్సవాలు, ధనుర్మాసం సందర్భంగా నెలరోజులు తిరుప్పావై పాశురాల పఠనం నిర్వహిస్తారు.

News December 11, 2025

విశాఖకు గూగుల్.. శంకుస్థాపన ఎప్పుడంటే?

image

విశాఖ ప్రజలకు మంత్రి నారా లోకేశ్ గుడ్ న్యూస్ చెప్పారు. మార్చిలో గూగుల్ డేటా సెంటర్‌కు శంకుస్థాపన చేస్తామని ప్రకటించారు. మరోవైపు విశాఖలోని ఐటీ హిల్స్‌పై 7ఐటీ కంపెనీలకు శుక్రవారం భూమిపూజ జరగనుంది. ఉదయం 11.30 గంటలకు నిర్వహించే కాగ్నిజెంట్ పూజలో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. ఈ మేరకు కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ఏర్పాట్లు చేస్తున్నారు.