News January 26, 2025
రిపబ్లిక్ డే వేడుకలకు సిద్ధమవుతున్న రాజన్న సిరిసిల్ల జిల్లా పరేడ్ గ్రౌండ్

రిపబ్లిక్ డే సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసు కార్యాలయం వద్ద ఉన్న పరేడ్ గ్రౌండ్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించేందుకు ఏర్పాటు చేస్తున్నారు. వేదికను స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదివారం(జనవరి 26) వ తేదీ ఉదయం 09.00 గంటలకు ఆవిష్కరించనున్నారు. 09.05 గంటలకు గౌరవ వందనం స్వీకరించనున్నారు. 09.10 గంటల నుంచి కలెక్టర్ సందేశము ఇవ్వనున్నారు
Similar News
News February 9, 2025
నెల్లూరు: రెండేళ్ల వ్యవధిలో ఇద్దరు కుమారుల దారుణ హత్య

నెల్లూరులో శనివారం కోడూరు కళ్యాణ్ అలియాస్ చిన్నా దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. కాగా రెండేళ్ల క్రితం చిన్నా సోదరుడు సాయిపై కొందరు కత్తులు, రాళ్లతో దాడి చేసి చంపేశారు. రెండేళ్ల వ్యవధిలో ఇద్దరు కుమారులు హత్యకు గురి కావడంతో వారి తల్లి గుండెలు పగిలేలా రోధిస్తున్నారు. కాగా ఇప్పటికే చిన్నా డెడ్ బాడీని పోస్ట్ మార్టం కోసం GGHకు తరలించారు.
News February 9, 2025
విజయవాడ: ఒకరికి తెలియకుండా మరొకరితో పెళ్లిళ్లు

ఓ భార్యకి తెలియకుండా మరో పెళ్లి, ఆ భార్యకు తెలియకుండా ఇంకో పెళ్లి ముచ్చటగా మూడో వివాహంతో అసలు కథ బయటికి వచ్చింది. సూర్యారావుపేటకు చెందిన రమేశ్ 2 పెళ్లిళ్లు చేసుకొని ఆ విషయం బయటకు రాకుండా 2022లో 3వ మహిళను పెళ్లి చేసుకున్నాడు. దీంతో ఆమె గర్భం దాల్చింది. దీన్ని తీసివేయాలంటూ నిందితుడు ఇబ్బంది పెట్టి, జ్యూస్‌లో అబార్షన్‌కు సంబంధించిన మాత్రలు ఇవ్వడంతో గర్భం పోయినట్లు ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.
News February 9, 2025
MNCL: త్వరలో వాహనాలకు ఫాస్ట్ ట్రాక్ ఏర్పాటు

కవ్వాల్ టైగర్ జోన్ పరిధిలోని మండలాల గ్రామాల వాహనాలకు త్వరలో ఫాస్ట్ ట్రాక్ ఏర్పాటు చేస్తామని తాళ్లపేట రేంజ్ అధికారి సుష్మారావు తెలిపారు. స్థానిక వాహనాలకు చెక్పోస్టుల వద్ద ఎలాంటి రుసుము వసూలు చేయమన్నారు. 24 గంటలు వాహనదారులు రాకపోకలు సాధించుకోవచ్చని వెల్లడించారు. ఫాస్ట్ ట్రాక్ ఏర్పాటుతో ఇక్కడి వాహనదారులకు ఇబ్బందులు తలుగుతాయని, దానిపై ఉన్నతాధికారులు పునరాలోచిస్తున్నట్లు పేర్కొన్నారు.