News August 12, 2025
రీపోలింగ్ కోసం పోరాటం చేస్తాం: కడప ఎంపీ

పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికపై బుధవారమే హైకోర్టుకు వెళ్తామని కడప ఎంపీ అవినాష్ రెడ్డి వెల్లడించారు. ‘ఇవాళ జరిగిన ఎన్నికను లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. కరుడుగట్టిన టీడీపీ కార్యకర్తల కన్నా పోలీసులు బాగా కష్టపడ్డారు. కేంద్ర బలగాల సమక్షంలో తిరిగి ఎన్నికలు నిర్వహించాలి. రీపోలింగ్ జరిగేలా వైసీపీ పోరాటం చేస్తుంది. ఎవరూ అధైర్యపడకండి. కార్యకర్తలు, నాయకులకు అండగా ఉంటాం’ అని ఎంపీ స్పష్టం చేశారు.
Similar News
News March 12, 2026
అమరావతి: ‘నాణ్యతతో హైకోర్టు నిర్మాణం పూర్తి చేయాలి’

అమరావతిలో జరుగుతున్న నిర్మాణ పనులను AGICL ఎండీ SVR శ్రీనివాస్ గురువారం పర్యవేక్షించారు. అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ (AGC) ఇన్‌ఫ్రా, హైకోర్టు సైట్‌లను సందర్శించి పనుల పురోగతిని పరిశీలించారు. గుత్తేదారులు, ఇంజినీరింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. హైకోర్టు భవన సముదాయాన్ని లక్ష్యానికి అనుగుణంగా నాణ్యతతో పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.

కోనసీమ: ఏప్రిల్ 30 తేదీలోపు చెల్లిస్తే వడ్డీ మాఫీ- ఈడీ

ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 2014-18 సంవత్సరాల్లో ఎస్సీలు లబ్ధిదారులు తీసుకున్న రుణాలపై ప్రభుత్వం వడ్డీ మాఫీ చేసిందని ఉమ్మడి జిల్లా ఎస్సీ కార్పొరేషన్ కార్యనిర్వహక సంచాలకులు జే.సత్యవతి గురువారం తెలిపారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణ బకాయిదారులు ఏప్రిల్ 30 తేదీలలోగా అసలు చెల్లిస్తే డిసెంబరు 2025 వరకు ఉన్న వడ్డీని పూర్తిగా మాఫీ చేస్తామన్నారు. లబ్ధిదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.