News May 1, 2024

రుణమాఫీ చేయకపోతే మళ్లీ మీ ముందుకు రాము: కోమటిరెడ్డి

image

నల్గొండ పట్టణంలో నల్గొండ అసెంబ్లీ బూత్ స్థాయి కార్యకర్తల సమావేశంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బుధవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఆగస్టు 15 వరకు రూ.2 లక్షల రుణమాఫీ చేయకపోతే భవిష్యత్తులో మీ ముందుకు రామని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 30 కిలోమీటర్ల ఎస్ఎల్బీసీ టన్నెల్‌ను పూర్తి చేస్తే పదేళ్ల కేసీఆర్ పాలనలో మూడు కిలోమీటర్లు కూడా పూర్తి చేయలేకపోయారని విమర్శించారు.

Similar News

News December 14, 2025

త్రిపురారం: రాష్ట్రంలోనే చిన్న పంచాయతీ.. ఎవరు గెలిచారంటే..

image

బృందావనపురం సర్పంచ్‌గా కాంగ్రెస్ బలపరిచిన మందడి రమణారెడ్డి విజయం సాధించారు. తన ప్రత్యర్థి, బీఆర్ఎస్ బలపరిచిన వంగాల శ్రీనివాస్ రెడ్డిపై ఏడు ఓట్ల తేడాతో రమణారెడ్డి విజయం సాధించారు. రమణారెడ్డి విజయం సాధించడంతో కాంగ్రెస్ శ్రేణులు, మద్దతుదారులు సంబరాలు జరుపుకుంటున్నారు. బృందావనపురం గ్రామపంచాయతీ రాష్ట్రంలోనే అతి చిన్న గ్రామపంచాయతీ కావడం విశేషం. ఇక్కడ కేవలం 98 ఓట్లు మాత్రమే ఉన్నాయి.

News December 14, 2025

నల్గొండ జిల్లాలో తొలి ఫలితం

image

నిడమనూరు మండలం వెంగన్నగూడెం గ్రామపంచాయతీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి సలాది నాగమణి నాగరాజు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ బలపరిచిన కొండారి నాగజ్యోతి చంద్రశేఖర్ మీద 87 ఓట్ల తేడాతో వారు విజయం సాధించారు. తమ మీద నమ్మకంతో గెలిపించిన ప్రజలకు వారు ధన్యవాదాలు తెలియజేస్తూ గ్రామ అభివృద్ధికి పాటుపడతామని నాగమణి తెలిపారు.

News December 14, 2025

నల్గొండ: బీసీల ఖాతాల్లోకి 49 శాతం సర్పంచ్ స్థానాలు

image

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో తొలి దశ పంచాయతీ ఎన్నికల్లో బీసీ అభ్యర్థులు ఆధిపత్యం చూపారు. మొత్తం 630 సర్పంచ్ స్థానాల్లో 308 చోట్ల బీసీలు గెలుపొందారు. వీటిలో 140 బీసీ రిజర్వ్ స్థానాలు కాగా, జనరల్ కేటగిరీలోనూ 158 స్థానాల్లో బీసీలు విజయం సాధించారు. ఎస్సీలు 138, ఎస్టీలు 91, ఓసీలు 93 స్థానాల్లో గెలిచారు. బీసీలకు 49 శాతం సర్పంచ్ స్థానాలు దక్కాయి.