News January 11, 2026

రూ.1.5లక్షల వరకు ఫ్రీ చికిత్స! త్వరలో కేంద్రం ప్రకటన

image

నేషనల్, స్టేట్ హైవేలపై ప్రమాదాల్లో గాయపడిన ఒక్కొక్కరికి రూ.1.5లక్షల వరకు క్యాష్‌లెస్ చికిత్స అందించే పథకాన్ని కేంద్రం అమలు చేయనుంది. ఆయుష్మాన్ భారత్ పథకంతో బాధితులకు 7రోజులు ఫ్రీగా ట్రీట్‌మెంట్ చేస్తారు. ప్రమాదం జరిగిన మొదటి గంట (గోల్డెన్ అవర్)లో డబ్బుల్లేని కారణంతో చికిత్స అందక మరణిస్తున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. దీనిని పరిష్కరించేందుకు ప్రధాని మోదీ త్వరలో ఈ పథకాన్ని ప్రకటించనున్నారు.

Similar News

News January 15, 2026

173 పోస్టులు.. దరఖాస్తుకు రేపే లాస్ట్ డేట్

image

NCERTలో 173 గ్రూప్ A, B, C పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. పోస్టును బట్టి టెన్త్, ఇంటర్ , డిగ్రీ, డిప్లొమా( ప్రింటింగ్ టెక్నాలజీ, గ్రాఫిక్స్), ITI, B.Tech, M.Tech, PG, MBA, B.L.Sc, M.L.Sc ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గలవారు అప్లై చేసుకోవచ్చు. రాతపరీక్ష/CBT, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: www.ncert.nic.in * మరిన్ని ఉద్యోగాల కోసం <<-se_10012>>జాబ్స్<<>> కేటగిరీకి వెళ్లండి.

News January 15, 2026

APPLY NOW: NALCOలో 110 పోస్టులకు దరఖాస్తు ఆహ్వానం

image

నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ (<>NALCO<<>>)లో 110 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. బీటెక్/బీఈ(మెకానికల్, ఎలక్ట్రికల్, కెమికల్) అర్హత గలవారు జనవరి 22 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 30ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. గేట్ 2025 స్కోరు ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.500. వెబ్‌సైట్: https://mudira.nalcoindia.co.in

News January 15, 2026

‘మన శంకరవరప్రసాద్ గారు’ కలెక్షన్లు ఇవే!

image

చిరంజీవి కామెడీ, ఫ్యామిలీ డ్రామాతో తెరకెక్కిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబడుతోంది. మంగళవారం కంటే బుధవారం వసూళ్లు పెరిగినట్లు Sacnilk తెలిపింది. సోమవారం రిలీజైన ఈ మూవీ మూడు రోజుల్లో ఇండియా వ్యాప్తంగా రూ.79.60కోట్ల నెట్ కలెక్షన్లు సాధించినట్లు పేర్కొంది. కాగా నిన్న ప్రపంచ వ్యాప్తంగా రూ.120+కోట్ల గ్రాస్ కలెక్షన్లు కొల్లగొట్టినట్లు మేకర్స్ వెల్లడించిన విషయం తెలిసిందే.