News September 27, 2024

రూ.18,256 కోట్లతో వార్షిక రుణ ప్రణాళిక విడుదల

image

వ్యవసాయానికి ఊతమిచ్చేలా బ్యాంకర్లు కృషి చేయాలని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖా మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. ఈ సందర్భంగా గురువారం ఏలూరు జిల్లా కలెక్టరేట్లో జిల్లా స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడారు. 2024-25 ఆర్ధిక సంవత్సరానికి రూ.18,256 కోట్లతో వార్షిక రుణ ప్రణాళిక విడుదల చేసినట్లు తెలిపారు.

Similar News

News October 9, 2024

ఇళ్ల నిర్మాణాలపై ఏలూరు జిల్లా కలెక్టర్ కీలక నిర్ణయం

image

ఏలూరు జిల్లాలో ఇళ్ల నిర్మాణాల లక్ష్యాలు కచ్చితంగా పూర్తిచేయాలని కలెక్టర్ వెట్రిసెల్వి సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లాలో ఇళ్ల నిర్మాణాల 100 రోజుల యాక్షన్ ప్లాన్ ప్రగతిపై జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా గృహనిర్మాణ శాఖ అధికారులతో సమీక్షించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. 100 రోజుల యాక్షన్ ప్లాన్‌లో భాగంగా రోజుకు 54 ఇళ్ల నిర్మాణాలు పూర్తిచేయాలని స్పష్టం చేశారు.

News October 9, 2024

పెదవేగి: ముగ్గురి ప్రాణం తీసిన పందెంకోడి

image

పెదవేగి మండలం కవ్వగుంట గ్రామంలో తండ్రి, ఇద్దరు కుమారులు <<14312151>>మృతి<<>> చెందిన విషయం తెలిసిందే. స్థానికుల వివరాల మేరకు.. పందెంలో పాల్గొనే కోడిపుంజుకు ఈత కొట్టిస్తుండగా ప్రమాదవశాత్తు తండ్రి, ఇద్దరు కుమారులు చెరువులో పడి మృతి చెందారు. ఈ ఘటనలో తండ్రి, ఓ కుమారుడి మృతదేహం లభ్యం కాగా మరో కుమారుడి మృతదేహం కోసం గాలిస్తున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలిస్తున్నారు.

News October 9, 2024

ఏలూరు: పోలవరం కుడి కాలువలో పడి ముగ్గురు మృతి

image

పెద్దవేగి మండలం కవ్వగుంటలో బుధవారం విషాదం చోటుచేసుకుంది. పోలవరం కుడి కాలువలో పడి తండ్రి, ఇద్దరు కుమారులు మృతి చెందారు. మృతులు వెంకటేశ్వరరావు (50), మణికంఠ(16), సాయికుమార్ (13)గా గుర్తించారు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ముగ్గురు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.