News April 23, 2025
రూ.2 లక్షల రుణమాఫీ చేశాం: మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే

రైతులు పండించిన ప్రతి గింజను కొంటామని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. MBNR జిల్లా వ్యవసాయ మార్కెట్‌లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. రైతు సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం పెద్దపీట వేసిందన్నారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన మాట ప్రకారం రైతులకు ఏకకాలంలో రూ.2లక్షల రుణమాఫీ చేశామని, గిట్టుబాటు ధర కల్పించి రైతుకు అండగా నిలిచామని, వ్యవసాయాన్ని పండుగ చేశామన్నారు.
Similar News
News March 14, 2026
మెదక్: తీవ్ర విషాదం.. కార్మికుడి మృతి!

శివంపేట్ మండలంలోని గోమారంలో విషాదం నెలకొంది. వీధి లైట్ల మరమ్మతులు చేస్తుండగా విద్యుత్ షాక్ తగిలి పంచాయతీ కార్మికుడు నీరుడి రాములు (48) విద్యుత్ స్తంభం పైనుంచి కిందపడిపోయారు. తలకు తీవ్ర గాయాలు కావడంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నర్సాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
News March 14, 2026
అరకులో హీరో సుమన్ సందడి

అనంతగిరి మండలంలో ఎన్ఆర్ పురంలో వైకుంఠగిరి వేంకటేశ్వర స్వామిని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం, సినీ హీరో సుమన్ దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ఎమ్మెల్యే, సుమన్‌ను ఆహ్వానించి ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం స్వామివారి ప్రతిమను వారికి ఇచ్చారు. ప్రజలందరిపై స్వామివారి ఆశీస్సులు ఉండాలని ఇరువురు ఆకాంక్షించారు. వైసీపీ నాయకులున్నారు.
News March 14, 2026
ఆర్మూర్‌లో ఘోర యాక్సిడెంట్.. ఇద్దరి మృతి

ఆర్మూర్ పట్టణంలోని పెట్రోల్ బంక్ సమీపంలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్మూర్ పిప్రి గ్రామానికి చెందిన ఒకరు, భీమ్‌గల్‌కు చెందిన మరో వ్యక్తితో స్కూటీపై వెళ్తుండగా అతివేగంతో వచ్చిన ఆటో బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు స్థానిక బార్‌లో పనిచేస్తున్నట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


