News March 31, 2024
రూ.2.49 కోట్లు స్వాధీనం: నంద్యాల కలెక్టర్

ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినప్పటి నుంచి జిల్లాలో ఎన్నికల కోడ్ ఉల్లంఘనలపై రూ.1.74 కోట్ల నగదు, రూ.59 లక్షల విలువైన మద్యం, రూ.16 లక్షల విలువ చేసే వస్తువులు.. మొత్తం కలిపి రూ.2.49 కోట్లు స్వాధీనం చేసుకుని సీజ్ చేశామని నంద్యాల కలెక్టర్ శ్రీనివాసులు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎన్నికల కోడ్‌ను పటిష్ఠంగా అమలు పరుస్తున్నామని పేర్కొన్నారు. ఎంసీసీ ఉల్లంఘనలపై కఠినంగా వ్యవహరిస్తున్నామన్నారు.
Similar News
News February 16, 2026
కర్నూలు జిల్లాలో యూరియా కొరత లేదు

కర్నూలు జిల్లాలో రబీ సీజన్‌కు అవసరమైన యూరియా సమృద్ధిగా అందుబాటులో ఉందని జిల్లా వ్యవసాయ అధికారి పీఎల్ వరలక్ష్మి తెలిపారు. ఇప్పటివరకు 18,168 మెట్రిక్ టన్నుల యూరియా విక్రయాలు జరిగాయని, ప్రస్తుతం 5,897 మెట్రిక్ టన్నుల నిల్వలు ఉన్నాయని చెప్పారు. ఎరువుల కొనుగోలు సమయంలో ఎంఆర్పీ ప్రకారం చెల్లించి, రశీదు తీసుకోవాలని రైతులకు సూచించారు.
News February 16, 2026
సీఎం, బిల్‌గేట్స్ వీసీలో పాల్గొన్న కర్నూలు కలెక్టర్

సీఎం చంద్రబాబు నాయుడు మైక్సోసాప్ట్ ఫౌండర్ బిల్‌గేట్స్‌తో కలిసి ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. స్వర్ణాంధ్ర 2047 విజన్ లక్ష్యాలు, ఆర్టీజీఎస్ టెక్నాలజీ, వ్యవసాయంలో ఆధునిక సాంకేతికత వినియోగంపై అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా బిల్‌గేట్స్‌కు రాష్ట్ర అభివృద్ధి ప్రణాళికలను వివరించారు. ఈ సమీక్షలో కలెక్టర్ డా.ఏ.సిరి, జేసీ నూరుల్ ఖమర్ వర్చువల్ విధానంలో పాల్గొన్నారు.
News February 16, 2026
ఫేక్ లింకులపై అప్రమత్తం కావాలి: కర్నూలు ఎస్పీ

కర్నూలులో ఫేక్ లింకుల ద్వారా సైబర్ మోసాలు పెరుగుతున్నాయని ఎస్పీ విక్రాంత్ పాటిల్ హెచ్చరించారు. క్రికెట్ లైవ్ స్ట్రీమింగ్, బ్యాంక్ KYC, లోన్ ఆఫర్లు పేరుతో వచ్చే లింకులు క్లిక్ చేయవద్దని సూచించారు. OTPలను ఎవరితోనూ పంచుకోవద్దని తెలిపారు. మోసానికి గురైతే వెంటనే 1930కు కాల్ చేయాలని సూచించారు. జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.


