News August 14, 2025

రూ.26 కోట్ల అంచనాతో 44 జలవనరుల పనులు: కలెక్టర్

image

జలవనరుల శాఖ ద్వారా రిపేర్, రెనోవేషన్, రెస్టోరేషన్ RRR క్రింద రూ.26 కోట్ల అంచనాతో 44 పనులకు కలెక్టర్ అంబేడ్క‌ర్ బుధవారం ఆమోదం తెలిపారు. ఈ ప్రతిపాదనలను టెక్నికల్ అడ్వైజరీ కమిటీ ఆమోదం పొందిన తర్వాత పనులు ప్రారంభం అవుతాయని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 నిష్పత్తిలో నిధులు కేటాయిస్తాయని అన్నారు. ఈ పనులకు ఆమోదం లభిస్తే జిల్లాలో 6,873 ఎకరాల ఆయకట్టుకు నీరందుతుందని కలెక్టర్ తెలిపారు.

Similar News

News March 17, 2026

విజయనగరంలో నేడు జాబ్ మేళా

image

విజయనగరంలోని మహారాజా కాలేజ్‌లో ఈ నెల 17 ఉదయం 10:30 గంటలకు జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్‌ఛేంజ్ అధికారులు సోమవారం తెలిపారు. ఫీల్డ్ క్రెడిట్ ఆఫీసర్, డెవలప్మెంట్ ఆఫీసర్, కెమిస్టు, అప్రెంటిస్ పోస్టులకు సంబంధించి సుమారు 250 ఖాళీలు భర్తీ చేయనున్నాయని, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా పూర్తి చేసిన వాళ్లు అర్హులన్నారు. అభ్యర్థులకు ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్‌ఛేంజ్ కార్డు తప్పనిసరి అని సూచించారు.

News March 17, 2026

ఫోన్ పోయిందా అయితే ఇలా చేయండి: VZM ఎస్పీ

image

మొబైల్ ఫోన్ పోయినా, దొంగతనం జరిగినా సమీప పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసి లేదా ఆన్‌లైన్‌లో CEIR పోర్టల్ ద్వారా నమోదు చేయవచ్చని జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ సోమవారం తెలిపారు. సమీప పోలీస్ స్టేషన్‌లో కూడా ఫిర్యాదు చేసి మొబైల్ ట్రాకింగ్ చర్యలు చేపట్టవచ్చని చెప్పారు. ప్రజలు తమ మొబైల్ IMEI నంబర్‌ను భద్రంగా ఉంచుకోవాలని, అనుమానాస్పద వ్యక్తుల వద్ద నుంచి సెకండ్ హ్యాండ్ ఫోన్లు కొనుగోలు చేయవద్దని సూచించారు.

News March 17, 2026

VZM: ‘మార్చి 28 వరకే ధాన్యం కొనుగోలు కేంద్రాలు పనిచేస్తాయి’

image

ఖరీఫ్ సీజన్‌కు సంబంధించిన ధాన్యం కొనుగోలు ప్రక్రియ చివరి దశకు చేరుకుందని JC సేధు మాధవన్ సోమవారం తెలిపారు. జిల్లాలోని రైతు సేవా కేంద్రాల ద్వారా నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఈ నెల 28 వరకు మాత్రమే పనిచేస్తాయని వెల్లడించారు. జిల్లాలోని 367 రైతు సేవా కేంద్రాల ద్వారా ఇప్పటివరకు 4.15 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని, సుమారు రూ.974 కోట్లు బ్యాంకు ఖాతాల్లో జమ చేశామన్నారు.