News April 12, 2025
రూ.2,700 కోట్లతో ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణం: మంత్రి రాజనర్సింహ

రూ. 2700 కోట్లతో ఉస్మానియా నూతన ఆసుపత్రి నిర్మాణం చేపడుతున్నట్లు మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. శుక్రవారం సాయంత్రం ఉస్మానియా మెడికల్ కాలేజీ విద్యార్థుల 174వ స్నాతకోత్సవంలో పాల్గొని విద్యార్థులకు పట్టాలు అందజేశారు. ఉస్మానియా కళాశాల, ఆసుపత్రి ప్రపంచ స్థాయిలో ప్రఖ్యాతిగాంచినవని తెలిపారు.
Similar News
News January 19, 2026
భూపాలపల్లి: సర్పంచ్‌లకు ప్రారంభమైన ఓరియంటేషన్ శిక్షణ

జిల్లా కేంద్రంలోని బీసీ బాలుర వసతి గృహంలో సర్పంచులకు సోమవారం శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. ఎనిమిది మంది రిసోర్స్ పర్సన్లు సర్పంచులకు విధివిధానాలపై అవగాహన కల్పిస్తున్నారు. ఐదు మండలాల నుంచి వచ్చిన 100 మంది సర్పంచులను రెండు బ్యాచ్‌లుగా విభజించి, ఐదు రోజుల పాటు ఈ తరగతులు నిర్వహించనున్నారు. పంచాయతీరాజ్ చట్టం, నిధుల వినియోగంపై అవగాహన కల్పించడమే ఈ శిక్షణ ముఖ్య ఉద్దేశమని అధికారులు తెలిపారు.
News January 19, 2026
IREDAలో అప్రెంటిస్ పోస్టులు.. అప్లై చేశారా?

ఇండియన్ రెనెవబుల్ ఎనర్జీ డెవలప్‌మెంట్ ఏజెన్సీ లిమిటెడ్(<
News January 19, 2026
అమెనోరియా సమస్యకు కారణమిదే!

వివిధ కారణాలతో కొందరు మహిళలకు నెలసరి సమయానికి రాదు. దీన్ని అమెనోరియా అంటారు. నెలసరి లేటుగా మొదలవడాన్ని ప్రైమరీ అమెనోరియా అని, రెగ్యులర్‌గా పీరియడ్స్ రాకపోవడాన్ని సెకండరీ అమెనోరియా అని అంటారు. వంశపారంపర్యం, జన్యు కారణాలు, PCOS, ఈటింగ్ డిజార్డర్ వల్ల ఈ సమస్య వస్తుంది. ప్రారంభదశలోనే చికిత్స చేయించుకోకపోతే గర్భసంచి, గుండె సమస్యలు, బోలు ఎముకల వ్యాధి వచ్చే ప్రమాదముంది.


