News August 14, 2025
రూ.5 లక్షల నగదు చోరీ

బ్యాంకులో డబ్బు డ్రా చేసుకొని వెళ్తున్న బాధితుడి నుంచి దుండగులు రూ.5 లక్షలు అపహరించారు. హాలహర్వి మండలం ఎంకేపల్లికి చెందిన గోపాల్ బుధవారం ఆలూరు ఎస్బీఐ నుంచి రూ.5 లక్షలు తీసుకొని స్కూటర్‌పై గ్రామానికి బయలుదేరారు. మార్గమధ్యంలో స్కూటర్ నిలిపి మూత్రవిసర్జనకు వెళ్లారు. అప్పటికే బాధితుడిని అనుసరిస్తున్న దుండగులు స్కూటర్‌లో ఉంచిన నగదు సంచిని అపహరించారు. బాధితుడు గోపాల్ ఆలూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Similar News
News March 9, 2026
కర్నూలు: నేడు డయల్ యువర్ ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ

విద్యుత్ వినియోగదారుల సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకు ఏపీఎస్పీడీసీఎల్ ఈనెల 9న ‘డయల్ యువర్ సీఎండీ’ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సమస్త ఛైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ శివ శంకర్ తెలిపారు. చిత్తూరు, నెల్లూరు, కడప, అన్నమయ్య, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల వినియోగదారులు 8977716661 నంబరుకు కాల్ చేసి తమ సమస్యలను సీఎండీ దృష్టికి తీసుకురావచ్చు అని తెలిపారు.
News March 9, 2026
లోన్ యాప్‌లపై అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ

అనుమానాస్పద లోన్ యాప్‌లను డౌన్‌లోడ్ చేయవద్దని ఎస్పీ విక్రాంత్ పాటిల్ ప్రజలను కోరారు. తక్కువ సమయంలోనే లోన్లు ఇస్తామని సోషల్ మీడియా, మెసేజ్‌ల ద్వారా వచ్చే ప్రలోభాలకు గురికావద్దని హెచ్చరించారు. లోన్ అవసరమైతే కేవలం గుర్తింపు పొందిన బ్యాంకులు మాత్రమే సంప్రదించాలన్నారు. ఎవరైనా యాప్‌ల ద్వారా వేధింపులకు లేదా బెదిరింపులకు పాల్పడితే వెంటనే 1930 నంబర్‌కు లేదా సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నారు.
News March 8, 2026
కర్నూలు జిల్లాలో మెగా కార్డన్ సెర్చ్

మాదకద్రవ్యాల నియంత్రణకు ‘ఆపరేషన్ వజ్రప్రహార్’లో భాగంగా శనివారం జిల్లా వ్యాప్తంగా పోలీసులు మెగా కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. 240 మంది పోలీసు సిబ్బంది పాల్గొని 870 మంది వ్యక్తులు, 345 వాహనాలను తనిఖీ చేశారు. సరైన పత్రాలు లేని 76 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. 35 లిక్కర్ బాటిల్స్ సీజ్ చేయగా, ఒక బైండ్ ఓవర్ కేసు నమోదు చేశారు. 1000 లీటర్ల బెల్లం ఊట, 300 లీటర్ల నాటు సారాను ధ్వంసం చేశారు.


