News December 1, 2025

రూ.73 లక్షలకు బంగారిగడ్డ సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవం!

image

నల్గొండ జిల్లా చండూరు మండలం బంగారిగడ్డ సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవం కానుంది. సర్పంచ్ అభ్యర్థిగా 11 మంది నామినేషన్ వేశారు. ఆ తర్వాత గ్రామంలోని కనకదుర్గ ఆలయ నిర్మాణం, గ్రామాభివృద్ధి కోసం ఏకగ్రీవం చేయాలని నిర్ణయించి వేలంపాట వేయడంతో రూ.73 లక్షలకు మహమ్మద్ సమీనా ఖాసీం అనే అభ్యర్థి దక్కించుకున్నట్లుగా తెలిసింది. ఏకగ్రీవం విషయమై అధికారుల నుంచి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.

Similar News

News February 17, 2026

కరీంనగర్: ‘అధికారుల్లో జవాబుదారితనానికి ఆర్టీఐ కీలకం’

image

అధికారుల్లో జవాబుదారితనం పెంచేందుకు సమాచార హక్కు చట్టం (RTI) దోహదపడుతుందని రాష్ట్ర సమాచార కమిషనర్లు స్పష్టం చేశారు. మంగళవారం కరీంనగర్ జిల్లా కలెక్టరేట్‌లో మీడియాతో మాట్లాడుతూ.. దరఖాస్తుదారులకు కోరిన సమాచారాన్ని నిర్ణీత గడువులోగా అందించడమే కమిషన్ లక్ష్యమని కమిషనర్లు శ్రీనివాసరావు, అయోధ్యరెడ్డి, మోసినా పర్వీన్, భోపాల్ పేర్కొన్నారు. చట్టం పట్ల పౌరులు అవగాహన కలిగి ఉండాలని వారు సూచించారు.

News February 17, 2026

వైవీయూలో మహిళలకు క్రీడా పోటీలు ప్రారంభం

image

యోగి వేమన విశ్వవిద్యాలయ, కళాశాల 21వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మంగళవారం వేమన క్రీడా మైదానంలో క్రీడలను వర్సిటీ కులసచివులు ఆచార్య పుత్తా పద్మ, వ్యాయామ విద్య క్రీడాశాస్త్రాల విభాగాధిపతి డా. కె.రామ సబ్బారెడ్డి ప్రారంభించారు. ఈ క్రీడా పోటీల్లో విద్యార్థినిలు, పరిశోధక విద్యార్థులు, బోధన, బోధనేతర మహిళా సిబ్బంది పోటీ పడ్డారు. విజేతలకు వ్యవస్థాపక దినోత్సవం నాడు బహుమతులు ప్రదానం చేస్తామన్నారు.

News February 17, 2026

నిరుద్యోగ మహిళలకు ఉపాధి అవకాశాలు: ఉపాధి అధికారిణి

image

జిల్లాలోని నిరుద్యోగ మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ‘మెగా ప్లేస్మెంట్ & కెరీర్ ఎక్స్పో -2026’కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి రజిత తెలిపారు. ఈనెల 19న ఉదయం 9 గం.నుంచి మధ్యాహ్నం 3 గం.వరకు తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల సెమినార్ హాల్ లో హాజరు కావాలన్నారు. 18 సంవత్సరాలు పైబడిన మహిళ అభ్యర్థులు అర్హులన్నారు.