News September 10, 2025
రెండు రోజుల్లో లిక్కర్ స్కామ్‌పై ఛార్జ్ షీట్..!

రెండు రోజుల్లో లిక్కర్ స్కామ్‌పై సిట్ ఛార్జ్ షీట్ దాఖలు చేయనుంది. ఈ కేసులో ఇప్పటికే వైసీపీ నేతల చెవిరెడ్డి భాస్కర్, MP మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసిన సిట్.. వారికి బెయిల్ రాకుండా అడ్డుకుంటోంది. ఉప రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలోనే MPకి మధ్యంతర బెయిల్ మంజూరైంది. మరోవైపు మోహిత్ రెడ్డి, మాజీ మంత్రి నారాయణ స్వామి, విజయానంద రెడ్డిపై సిట్ విచారణ చేపట్టింది. దీంతో వీరి భవితవ్యం ఏంటన్న చర్చ జోరుగా సాగుతోంది.
Similar News
News December 17, 2025
పెద్దపల్లి: 9 గంటల వరకు ఓటేసిన 32,068 మంది

పెద్దపల్లి జిల్లాలో మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఉదయం 9 గంటల వరకు 1,42,548 మంది ఓటర్లలో 32,068 మంది(22.50%) తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎలిగేడులో 18,426 ఓటర్లలో 4,157 మంది, ఓదెలలో 35,194లో 6,864 మంది, పెద్దపల్లిలో 50,164లో 10,938 మంది, సుల్తానాబాద్లో 38,764లో 10,109 మంది ఓటు వేశారు.
News December 17, 2025
సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి: SP

కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర కోనాపూర్, హన్మాజీపేట్ గ్రామాలలో బుధవారం పర్యటించారు. ఈ పోలింగ్ కేంద్రాల వద్ద ఉన్న పోలింగ్ సరళిని, అలాగే బందోబస్తు ఏర్పాట్లను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. ఎన్నికలు శాంతియుత వాతావరణంలో జరిగేలా చూడాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు ఇవ్వకుండా అప్రమత్తంగా ఉండాలని అక్కడ విధుల్లో ఉన్న పోలీస్ సిబ్బందికి ఎస్పీ తగిన సూచనలు చేశారు.
News December 17, 2025
నల్గొండ: @9AM.. పోలింగ్ శాతం ఎంతంటే?

నల్గొండ జిల్లా దేవరకొండ రెవెన్యూ డివిజన్ పరిధిలోని 9 మండలాలలో 9 గంటల వరకు 29.46% పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. మొత్తం ఓటర్లు 2,53,689 ఉండగా 41,285 పురుషులు, 33,439 మహిళలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉందన్నారు. పోలీసులు భద్రతా ఏర్పాట్లు కొనసాగిస్తున్నారు.


