News November 30, 2025
రెండేళ్లలో రూ.71,500 కోట్ల మద్యం తాగేశారు!

TG: 2023 నుంచి 2025 నవంబర్ వరకు రాష్ట్రంలో రూ.71,500 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి. అందులో 60% విస్కీ, మిగిలినవి బీర్, వోడ్కా, బ్రాందీ మొదలైనవి ఉన్నాయి. కొత్త ఎక్సైజ్ పాలసీ ప్రకారం 2025 డిసెంబర్ నుంచి 2027 నవంబర్ చివరి వరకు రెండేళ్లలో మద్యం అమ్మకాలు దాదాపు రూ.90,000 కోట్ల వరకు ఉంటాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఇటీవల 2,620 వైన్ షాపుల వేలం ద్వారా సర్కారుకు రూ.2,868 కోట్ల ఆదాయం వచ్చింది.
Similar News
News February 13, 2026
కొత్త హెల్త్ పాలసీ.. 12.84 లక్షల మందికి ప్రయోజనం

TG: ప్రభుత్వం తీసుకురానున్న <<19121822>>కొత్త హెల్త్ పాలసీ<<>>తో ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసులు, పెన్షనర్లు, వారి కుటుంబీకులు 12.84 లక్షల మందికి ప్రయోజనం చేకూరనుంది. ఈ స్కీమ్ అమలు కోసం సీఎస్ ఛైర్మన్‌గా 16 మంది సభ్యులతో కమిటీ ఏర్పాటుచేస్తారు. 515 ఎంప్యానెల్డ్ ఆస్పత్రుల్లో 1,885 రకాల చికిత్సలు వ్యయపరిమితి లేకుండా అందనున్నాయి. 15 రోజుల్లో సీఎం ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు.
News February 13, 2026
మెనోపాజ్ తర్వాత గుండె సమస్యలు

మహిళల్లో మెనోపాజ్ తర్వాత అనారోగ్యాలు చుట్టుముడతాయి. ముఖ్యంగా ఈ సమయంలో ఈస్ట్రోజెన్ తగ్గి టెస్టోస్టెరాన్ పెరగడంతో గుండెసంబంధిత సమస్యలు పెరుగుతాయంటున్నారు నిపుణులు. గుండె ఆరోగ్యంగా ఉండాలంటే రెగ్యులర్ హార్ట్ చెకప్స్, వ్యాయామం, ఆరోగ్యకరమైన జీవనశైలి అవసరం. కొలెస్ట్రాల్, BP, బ్లడ్ గ్లూకోజ్ లెవల్స్ చెక్ చేసుకోవాలి. ఫైబర్, నట్స్, ఫ్రూట్స్, కూరగాయలు, చేపలు ఆహారంలో చేర్చుకోవాలని సూచిస్తున్నారు.
News February 13, 2026
గుడ్ న్యూస్.. బెంగళూరులో ఆర్సీబీ మ్యాచులు

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఐపీఎల్ మ్యాచుల నిర్వహణపై మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు కర్ణాటక డిప్యూటీ సీఎం శివకుమార్ తెలిపారు. జస్టిస్ మైఖేల్ డి కున్హా సిఫార్సులను అమలు చేయనున్నట్లు Xలో వెల్లడించారు. టికెట్లు, ప్రేక్షకుల నియంత్రణ, స్టేడియం యాక్సెస్ విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని పేర్కొన్నారు. బాధ్యత, జవాబుదారీతనంతో ముందుకు వెళ్తామని చెప్పారు.


