News May 7, 2025
రెడ్ క్రాస్‌లో బాపట్లకు మొదటి స్థానం

బాపట్ల జిల్లా రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదు విషయంలో రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచింది. ఈ ఫలితంతో జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళి మే 8న విజయవాడలో గవర్నర్ చేతుల మీదుగా ‘బెస్ట్ కలెక్టర్ అవార్డు’ అందుకోనున్నారు. జిల్లా అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, ఆర్డీవోలు, తహసీల్దార్ల సమిష్టి కృషి వల్లే ఈ గుర్తింపు లభించిందని కలెక్టర్ హర్షం వ్యక్తం చేశారు.
Similar News
News February 11, 2026
ఇక్కడ స్నానం చేస్తే పాపాలు పోతాయట

ఒడిశాలోని బింకా సమీపంలో మహానది తీరాన ఉన్న పాపాక్షయ ఘాట్‌కు 900 ఏళ్ల చరిత్ర ఉంది. బ్రాహ్మణ హత్య దోషంతో బాధపడిన అనంగ భీమదేవుడు ఇక్కడ స్నానం చేసి విముక్తి పొందాడని కథనం. ఓ ఆవు స్వయంగా పాలిచ్చిన చోట రాజు కపిలేశ్వర శివాలయాన్ని నిర్మించాడు. ఇక్కడి మహానదిలో స్నానం చేసి, శివుడిని దర్శించుకుంటే పాపాలు తొలగి మనశ్శాంతి కలుగుతుందని విశ్వాసం. ప్రకృతి ఒడిలో ప్రశాంతంగా ఉండే ఈ ఘాట్‌కు ఏటా ఎంతో మంది వస్తుంటారు.
News February 11, 2026
విజయవాడకు ఉపాధికి వచ్చారా..ఈ ఉచిత వసతి మీకోసమే

ఉపాధి కోసం విజయవాడ వచ్చిన నిరుద్యోగులకు వీఎంసీ-మెప్మా సంయుక్తంగా కలిచి ఉచిత వసతిని కల్పిస్తోంది. ఆధార్ కార్డు ఉంటే పైసా చెల్లించినవసరం లేకుండానే ఆశ్రయాన్ని ఇవ్వనుంది. వీరికి కోసం విద్యాధరపురం, రాణిగారితోట, గాంధీనగర్, వెహికల్ డిపో ప్రాంతాల్లో హాస్టల్స్‌ను ఏర్పాటు చేసింది. భోజన వసతి, టీవీ బెడ్ తదితర సౌకర్యాలను అందిస్తోంది.
News February 11, 2026
సోషల్ మీడియాలో ఫేక్ AI కంటెంట్.. కేంద్రం కీలక ఆదేశాలు

సోషల్ మీడియాలో AI కంటెంట్‌కు SM ప్లాట్‌ఫామ్‌లు తప్పనిసరిగా లేబుల్ వేయాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. తప్పుదోవ పట్టించే లేదా చట్టవిరుద్ధమైన కంటెంట్ తొలగింపు విషయంలో కోర్టు/ప్రభుత్వం ఆదేశించిన 3 గంటల్లోగా తొలగించాలని గడువు విధించింది. అంతకుముందు 36 గంటలు గడువు ఉండగా ఈ నెల 20 నుంచి ఈ ఉత్తర్వులు అమలుకానున్నాయి. AI కంటెంట్ దుర్వినియోగంపై యూజర్లకు 3 నెలలకోసారి అవగాహన కల్పించాలని తెలిపింది.


