News August 21, 2025
రెడ్ బుక్ రాజ్యాంగం పతాక స్థాయికి చేరింది:

రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం పతాక స్థాయికి చేరిందని వైసీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి మండిపడ్డారు. నంద్యాలలో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మంత్రులు, ఎమ్మెల్యేల అవినీతి, అక్రమాలు పెరిగిపోతున్నాయని అన్నారు. అవినీతిపరులను సీఎం చంద్రబాబు నియంత్రించలేని పరిస్థితిలో ఉన్నారన్నారు. ఫారెస్ట్ అధికారులను కారులో తిప్పుతూ దాడి చేయడం ఏంటని ప్రశ్నించారు.
Similar News
News January 18, 2026
హైదరాబాద్‌పై NTR చెరగని ముద్ర

HYDపై మాజీ CM దివంగత NTR చెదరని ముద్ర వేశారు. ట్యాంక్‌బండ్‌లో మనం చూసే బుద్ధ విగ్రహం ఆయన ఆలోచనలోనుంచే పుట్టింది. ఇందులో 1990 మార్చి 10న ప్రపంచంలోనే ఎత్తైన ఏకశిలా బుద్ధ విగ్రహ తొలి ప్రతిష్ఠ విషాదంగా మారింది. అనంతరం 1992లో విజయవంతంగా ప్రతిష్ఠించగా, నేడు అది HYDకు ప్రతీకగా నిలుస్తోంది. సాగరతీరం సౌందర్యవృద్ధికి 1996లో నెక్లెస్ రోడ్డును రూపుదిద్దారు. నేడు ఆయన వర్ధంతి సందర్భంగా HYD ఆయనను స్మరిస్తోంది.
News January 18, 2026
రాజకీయం ఇప్పుడే మొదలైంది: శివసేన(UBT)

ముంబై మున్సిపల్ ఎన్నికల ఫలితాల తర్వాత ‘రిసార్ట్ రాజకీయం’ మొదలైన తరుణంలో శివసేన (UBT) కీలక వ్యాఖ్యలు చేసింది. ‘ఎన్నికలు ముగిశాయి. ఫలితాలు వచ్చాయి. అసలైన రాజకీయం ఇప్పుడే మొదలవుతుంది’ అని సామ్నా ఎడిటోరియల్‌లో పేర్కొంది. ముంబైకి ఇప్పటివరకు 23 మంది మరాఠీ మేయర్లను అందించిన సంప్రదాయం కొనసాగుతుందా అని ప్రశ్నించింది. మేయర్ ఎంపిక విషయంలో CM ఫడణవీస్, Dy.CM షిండే మధ్య అంతర్గత పోరు నడుస్తోందని రాసుకొచ్చింది.