News February 18, 2025
రెబ్బెనలో మతిస్థిమితం లేని మహిళ మృతి

మండలంలోని గోలేటి భీమన్న గుడి వద్ద మతిస్తిమితం లేని మహిళ మృతి చెందినట్లు ఎస్ఐ చంద్రశేఖర్ తెలిపారు. వాసాల మడుగు గ్రామానికి చెందిన టేకం కన్ను బాయ్ సోమవారం మృతి చెందినట్లు వెల్లడించారు. ఆమె భర్త రాము 3 సంవత్సరాల క్రితం మృతి చెందడంతో మతిస్తిమితం కోల్పోయి తిరుగుతుందని, తండ్రి గజ్జల చిన్న భీము తెలిపినట్లు పేర్కొన్నారు. అతడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Similar News
News April 20, 2026
తూ.గో: అర్ధరాత్రి ఘోర ప్రమాదం.. ఇద్దరు స్పాట్ డెడ్!

రాజమండ్రి సమీపంలోని గామన్ వంతెనపై ఆదివారం అర్ధరాత్రి బైకులు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మృతుల్లో కొవ్వూరు(M) తెనకనమెట్టకు చెందిన కోడి లక్ష్మీగణపతి(32)తో పాటు ఎదురుగా బైకుపై వస్తున్న మరో గుర్తుతెలియని యువకుడు(27) ఉన్నారు. లక్ష్మీగణపతి విధులు ముగించుకుని ఇంటికి వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు స్థానికులు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News April 20, 2026
NLG: రైతులకు గుడ్ న్యూస్.. నేడు రెండో విడత భరోసా…

జిల్లాలో రైతు భరోసా పథకం కింద అన్నదాతలకు రెండో విడత ఆర్థిక సాయం అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. తొలి విడతలో భాగంగా జిల్లాలోని 5,22,313 మంది రైతులకు రూ. 268.57 కోట్లను ప్రభుత్వం ఇప్పటికే విడుదల చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రెండో విడతలో భాగంగా ఎకరాల వారీగా రైతులకు సాయం అందించే ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. ఇవాళ రైతుల ఖాతాల్లోకి పెట్టుబడి సాయం జమ చేయనున్నది.
News April 20, 2026
చరిత్ర సృష్టించిన పంజాబ్

IPLలో పంజాబ్ కింగ్స్ చరిత్ర సృష్టించింది. ఒక సీజన్లో ఆడిన తొలి 6 మ్యాచుల్లో ఒక్క ఓటమి ఎరుగని ఫస్ట్ టీమ్‌గా నిలిచింది. KKRతో మ్యాచ్ వర్షం వల్ల రద్దు కాగా మొత్తం 11 పాయింట్లతో టాప్ ప్లేస్‌లో నిలిచింది. ఆ తర్వాత ఆర్సీబీ (8 పాయింట్లు), రాజస్థాన్ (8 పాయింట్లు), సన్‌రైజర్స్ (6 పాయింట్లు) ఉన్నాయి. ఇక ఇప్పటివరకు కేవలం ఒకే ఒక మ్యాచ్ గెలిచిన ముంబై ఇండియన్స్ 2 పాయింట్లతో లాస్ట్ ప్లేస్‌లో ఉంది.


