News December 1, 2025
రెవిన్యూ సమస్యలు పరిష్కరించండి: అల్లూరి కలెక్టర్

గ్రామాల్లో నెలకొన్న రెవిన్యూ సమస్యలు మండల స్థాయిలో పరిష్కరించాలని కలెక్టర్ దినేష్ కుమార్ తహశీల్దార్‌లను ఆదేశించారు. రంపచోడవరంలో చింతూరు, రంపచోడవరం డివిజన్‌ల రెవిన్యూ అధికారులతో సోమవారం సాయంత్రం సమావేశం నిర్వహించారు. ప్రతీ వారం తన వద్దకు 60 సమస్యలు ఈ ప్రాంతం నుంచి వస్తున్నాయని అన్నారు. అన్నిటిని ఇక్కడే పరిష్కరించడానికి అధికారులు కృషి చేయాలన్నారు.
Similar News
News February 18, 2026
ఇది కాంగ్రెస్ ప్రభుత్వ కక్షసాధింపు చర్య: బాల్కొండ ఎమ్మెల్యే

ప్రతిపక్ష నాయకులపై కాంగ్రెస్ ప్రభుత్వం కక్షసాధింపులకు పాల్పడుతోందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్టును ఖండిస్తూ బుధవారం ఆయన పత్రికా ప్రకటన విడుదల చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించాలని, అక్రమాలను అడ్డుకోవాలని ప్రశ్నించిన బాల్క సుమన్‌ను అరెస్టు చేయడం దుర్మార్గమన్నారు.
News February 18, 2026
సిద్దిపేట: వ్యవసాయ ఆర్థిక శాస్త్రంలో సౌమ్యకు డాక్టరేట్

సిద్దిపేట పట్టణానికి చెందిన వ్యాపారవేత్త చీల లక్ష్మణ్-పద్మ దంపతుల కుమార్తె చీల సౌమ్య అరుదైన గౌరవం అందుకున్నారు. ప్రతిష్టాత్మక ఐఏఆర్ఐ నుంచి వ్యవసాయ ఆర్థిక శాస్త్రంలో ఆమె పీహెచ్‌డీ పూర్తి చేసి డాక్టరేట్ పట్టా పొందారు. తన తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే ఈ స్థాయికి చేరుకున్నానని సౌమ్య ఈ సందర్భంగా ఆనందం వ్యక్తం చేశారు. ఆమె ప్రతిభను స్థానికులు, కుటుంబ సభ్యులు అభినందించారు.
News February 18, 2026
శ్రీకాకుళం: టుడే టాప్ న్యూస్ ఇవే

★శ్రీముఖలింగం: చక్రతీర్థస్నానాలకు పోటెత్తిన భక్తులు
★నందిగాం: వృక్షం వేర్లు ఆలయానికి రక్షణ
★వంశధార ఆధునీకరణపై ప్రభుత్వం దృష్టి సారించాలి: ఎమ్మెల్యే బగ్గు
★పలాస: చైన్ స్నాచింగ్ చేస్తుండగా పట్టేశారు
★ఆదిత్యుని సన్నిధిలో ఐఆర్ఎస్ ప్రిన్సిపల్ కమీషనర్
★శ్రీకాకుళం: ఈనెల 20న జాబ్ మేళా
★ఎల్.ఎన్ పేట: నదీ తీరాన ఆకట్టుకున్న ఈశ్వరుని సైకత శిల్పాలు
★ఎచ్చెర్ల: తగ్గిన టమాట ధర


